Suriya- Jyothika:కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క వీరు సినిమాల్లో నటిస్తూనే సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇవి కాకుండా ఈ జంట చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికి తెల్సిందే.
Udayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కు కీలకపదవి కట్టబెట్టారు. డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మళ్లీ నియమించారు.
CM Morning Walk: ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినా మనలో ఒకడిగా సింపుల్‌గా ఉండడమే ఆయన నైజం. ఎక్కడికి వెళ్లినా తనదైన శైలిలో సాధారణ తెల్లని దుస్తులతో వెళ్తుంటారు.
అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్‌లో భాగంగా ఓ మహిళ కలెక్టర్ రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది... చెస్ బోర్డుపై పావుల స్థానంలో మనుషులే పాత్రధారులైతే ఎలా ఉంటుందో ఓ వీడియో రూపంలో తెరకెక్కించారు.
ఒక దేశం-ఒకే భాష నినాదంపై తమిళనాడు సీఎం సీరియస్ అయ్యారు. అయితే.. హిందీ భాషను బలవంతంగా రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తుందని , ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు. తమిళనాడులో ‘ఇండియా ఎట్ 75 మనోరమా న్యూస్ కాంక్లేవ్ 2022’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. విలేఖరులను అరెస్టు చేయడం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు…
తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా 2వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో చెన్నైలోనే 909 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అటు చెంగల్పట్టులో 352, కాంచీపురంలో 71, తిరువళ్లూరులో 100 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు జిల్లాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని.. లేకుంటే…
తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల మధ్య వివాదం చినికి చినికి గాలివాన చందంగా మారుతోంది. నేడు ఆస్తుల లెక్కపై దీక్షితుల వైఖరి పై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి. చిదంబరం ఆలయాల్లో దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే, ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు దేవాదాయ శాఖ. తాజాగా అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అధీనాధిపతులు,…
తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు జయలలిత తర్వాత చక్రం తిప్పిన నేత శశికళ. ఇప్పుడామె పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో దూసుకుపోవాలని భావించిన ఆమె ఆశలు తీరలేదు. పైగా కేసులతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చిన శశికళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని, అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించినా ఆ విషయంలో విఫలమయ్యారు. ఆ పార్టీ నేతలు ఆమె ముఖం చూడడానికి కూడా ఇష్టం పడకపోవడంతో ఆమె కీలక నిర్ణయం…
ప్రధాని హైదరాబాద్ పర్యటన తరువాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. దాదాపు రూ. 31,000 కోట్లతో 11 డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సీఎం ఎంకే స్టాలిన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల్లో పలు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళనాడులో పర్యటిస్తున్న మోదీకి ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోదీకి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా హిందీ లాగే తమిళాన్ని అధికార భాష చేయాలని.. మద్రాస్…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయాన్ని లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దుల్లో జోరుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోందన్న ఆయన.. తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తున్నారని.. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెంచాలని లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు, స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల…