Tamilnadu: త్వరలోనే మంత్రి కాబోతున్న యువ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడ మరికొద్దిరోజుల్లో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, యువ హీరో ఉదయనిధి స్టాలిన్ కేబినెట్‌లోకి రాబోతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ యువ నాయకుడికి సన్నిహితంగా ఉన్న కొందరు డీఎంకే నేతలు ఈ వార్తలు నిజమే అని ధృవీకరిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే ప్రజాదరణ పొందారని.. చాలామంది మంత్రులు తమ కార్యక్రమాల్లో ఆయనతో వేదిక పంచుకోవాలని కోరుకుంటున్నారని పలువురు వెల్లడిస్తున్నారు.
అటు అసెంబ్లీలో కూడా ఉదయనిధి స్టాలిన్‌కు ఇతర ఎమ్మెల్యేల నుంచి మంచి గౌరవం అందుతోందని డీఎంకే ఎమ్మెల్యేలు స్వయంగా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేబినెట్‌లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నలుగురు వ్యక్తులు ఉన్నారని.. అలాంటప్పుడు క్రౌడ్ ఫుల్లింగ్ ఉన్న ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రి చేయడంలో తప్పు లేదని కొందరు డీఎంకే నేతలు భావిస్తున్నారు. 1989 నుంచి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారీ పార్టీ యువజన విభాగంలో ఒక్కరికైనా మంత్రి పదవి దక్కుతోందని.. అయితే ఈసారి యువజన విభాగం నుంచి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఉదయనిధి స్టాలిన్‌కు ఇవ్వడమే సరైందని సూచిస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో చెపాక్ నుంచి ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?