వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి వ్యతిరేకించారు. మద్దతు కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్‌డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నీట్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను తిరిగి పొందడానికి ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు అప్పుడప్పుడు సైకిల్ నగరంలో ప్రయాణం చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న స్టాలిన్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. పోలీస్ స్టేషన్‌లో పనితీరును తెలుసుకుకేందుకు అర్థరాత్రి సమయంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సేలం నుంచి ధర్మపురికి వెళ్తుండగా ఆయన మధ్యలో అద్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ స్టేషన్ పనితీరును రికార్డులను పరిశీలించారు. సీఎం ఇలా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనిఖీలు చేయడంతో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే… తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. చేసిన ఓ ట్వీట్ పై తమిళనాడు శాసనసభలో చర్చ జరిగింది. శాసనసభలో ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రసంగిస్తూ.. ఓ ట్వీట్ గురించి ప్రస్తావించారు. ప్రతి పక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా తమిళనాడు ముఖ్యమంతరి స్టాలిన్…
కేంద్రం ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేయడం మంచిది కాదని దీనిపై ప్రధాని మోడికీ లేఖ రాస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ విధానంపై ఆయన ఈరోజు విమర్శలు చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజా ఆస్తులని, అవి దేశ భవిష్యత్తుకు, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేశారని, వాటిని అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం వంటిది దేశప్రయోజనాలకు మంచిది కాదని…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ వ్యవసాయం రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ… కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలను కేంద్రం ప్రతిపాదించినప్పటి నుంచి… బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అటు ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ చట్టాలను వ్యతిరేకించాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది తమిళనాడు సర్కార్. శాసన సభలో మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని…
తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్టాలిన్ పేరు మారుమ్రోగిపోతున్నది. గతంలో స్టాలిన్ చెన్నై మేయర్‌గా పనిచేసిన రోజుల్లో చాలా ఉత్సాహంగా, ఫిట్‌గా కనిపించేవారు. నిత్యం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలపై చర్చించేవారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఆయన తన దినచర్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. నిత్యం యోగా, సైక్లింగ్, జిమ్ చేయడం తప్పనిసరి. 68 ఏళ్ల వయసులో స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన…
తమిళనాడులో బ్రాహ్మణేతరులు పూజారులుగా మారబోతున్నారు. బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన అర్చకత్వాన్ని.. ఇకపై ఇతర సామాజిక వర్గాల వారు చేపట్టనున్నారు. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ వర్గాలకు చెందిన సుశిక్షితులైన 24మంది బ్రాహ్మణేతులను పలు పుణ్యక్షేత్రాల్లో అర్చకులుగా నియమించింది. ఇందులో ఐదుగరు షెడ్యూల్ కులాల వారు, ఆరుగురు ఎంబీసీలు, 12 మంది బీసీలు, ఓసీకి చెందిన ఒకరు ఉన్నా వీరితోపాటు మరో 138 మందిని ఆలయాల్లో పని చేయడానికి నియమించారు. వీరంతా ప్రభుత్వం…
ప్రధాని మోడీకి తమిళనాడు సిఎం స్టాలిన్ లేఖ రాశారు. కావేరీ బేసిన్ లో హైడ్రోకార్బన్ వెలికితీత బిడ్డింగ్ ను వెంటనే ఆపేలా పెట్రోలియం, సహజ వనరుల శాఖను ఆదేశించాలని ప్రధాని మోడీని లేఖలో స్టాలిన్ కోరారు. కావేరి బేసిన్ రైతులకు ఈ ప్రాజెక్టు ముప్పుగా మారనుందని, ఆ ప్రాంత పర్యావరణ పరిరక్షణకు ఇది విఘాతం కలిగిస్తుందని ప్రధానికి లేఖలో స్పష్టం చేశారు స్టాలిన్…ఈ అంశంలో వెంటనే కల్పించుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఈ తరహా ప్రాజెక్టులపై ముందుకెళ్లే ముందు…