The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేరళలో జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు ఇతివృత్తంగా సినిమాను రూపొందించినట్లు మూవీ మేకర్స్ వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ సినిమా హిందూ-ముస్లింల వైషమ్యాలు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉందని దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ఏకంగా.. ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వ్యవహారం కొసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్లు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
Periyar, Karl Marx photos ‘vandalised’ at JNU: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ)లో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ అనుబంధం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే మొదలైన వారి ఫోటోలను ధ్వంసం చేశారని వామపక్ష విద్యార్థి విభాగం(ఎస్ఎఫ్ఐ), జెఎన్‌యూ విద్యార్థి సంఘం సోమవారం ఆరోపించింది.
Telangana New Secretariat inauguration: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త సచివాలయం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.. వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17వ తేదీన శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.…
DMK Worker's Threat To Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం అలాగే కొనసాగుతోంది. డీఎంకే నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ‘గెట్ అవుట్ రవి’ అంటూ చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో పోస్టర్లను ఏర్పాటు చేశారు డీఎంకే పార్టీ నేతలు. ఇదిలా ఉంటే తాజాగా మరో డీఎంకే నేత బహిరంగంగానే గవర్నర్ రవిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం…
Pongal Gift: తమిళనాడు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పొంగల్ గిప్ట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపు వినియోగదారులకు రూ.1000 నగదు, 1 కేజీ తీపి బియ్యం, 1 కేజీ పంచదార, మొత్తం చెరకు బహుమతి ప్యాకేజీలుగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు శుభవార్త చెప్పారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగల్ గిఫ్ట్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.. రేషన్ కార్డ్ దారులకు వెయ్యి రూపాయల నగదు పాటు.. ఒక కేజీ చక్కెర, కేజీ బియ్యం కానుకగా అందిస్తున్నారు.. తమిళనాడులోని 2.19 కోట్లమందికి ఈ పండుగకు ప్రయోజనం చేకూరనుంది.. రేషన్ కార్డ్ హోల్డర్లు అందరూ దీనికి అర్హులు.. ఇది శ్రీలంక పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. ఒక్కో కేజీ బియ్యం,…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో.. దేశాల్లోనూ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు సీఎం జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు.. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు.. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని ఆక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, వైఎస్ జగన్‌కి నా హృదయపూర్వక అభినందనలు…
డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు తమిళనాడు కేబినెట్లో అవకాశం లభించింది.. ఈ నెల 14వ తేదీన ఉదయనిధి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.. 45 ఏళ్ల ఎమ్మెల్యే మరియు సినీ నటుడైన ఉదయనిధి.. డిసెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. చేపాక్-తిరువల్లికేని అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయనిధికి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల అమలు వంటి శాఖలు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. ఉదయనిధికి మంత్రి పదవిపై చాలా…