మరోసారి తెరపైకి ఫెడరల్ ఫ్రంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారా? తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీలో ప్రాంతీయ పార్టీల కూటమి గురించే చర్చించారా? ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తారా? ఫెడరల్ ఫ్రంట్‌కు రూపు తీసుకొస్తారా?
ఆ మధ్య శివసేన, ఎన్సీపీలతో మమత చర్చలు..!
Also Read
2024 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. శివసేన, ఎన్సీపీ నేతలతో భేటీ అయ్యారు. జాతీయస్థాయిలో బీజేపీని ఎదుర్కోవడంపై చర్చించారు మమత. ఆ సందర్భంగా UPA ఎక్కడుంది అని ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
2019 ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతను ప్రస్తావించిన కేసీఆర్..!
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో డీఎంకే అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. గతంలో ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను ప్రస్తావించారు కేసీఆర్. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు స్టాలిన్, మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్ , జార్కండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీపార్టీ నేత అఖిలేష్ యాదవ్‌లతో ఫెడరల్ ప్రంట్ పై చర్చించారు కేసీఆర్. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ముందుకెళ్లలేదు.
ఫెడరల్ ఫ్రంట్‌కు మరోసారి కదలిక తెస్తున్నారా?
ఇప్పుడు ధాన్యం కొనుగోలుపై మోడీ సర్కార్, బీజేపీలపై తీవ్రస్థాయిలో టీఆర్‌ఎస్ మండిపడుతోంది. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణి అవలంభిస్తోందని కేసీఆర్ విమర్శిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు.. సభలు బహిష్కరించారు. ఆ సందర్భంగా ఇతర విపక్ష పార్టీలు చేస్తున్న నిరసనలకు టీఆర్ఎస్ మద్దతు పలికింది.. TRS ఎంపీలు విపక్షపార్టీలతో శ్రుతి కలిపారు. ఇప్పుడు మారిన పరిణామాలతో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌కు కేసీఆర్ మరోసారి కదలిక తెస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే అది ఎంత వరకు సక్సెస్ అవుతుందనే చర్చ జరుగుతోంది.
ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటైతే లాభనష్టాలేంటి?
ఫెడరల్ ఫ్రంట్ దిశగా త్వరలో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ సమాలోచనలు చేస్తారని టాక్. జాతీయ స్థాయిలో జరిగే పరిణామాలకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న.. గతంలో పనిచేసిన పార్టీలు కొత్త కూటమి కోసం జట్టు కట్టేందుకు ఎంత వరకు ముందుకొస్తాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. పూర్తిస్థాయిలో కేవలం ప్రాంతీయ పార్టీలతో ఒక ఫ్రంట్ ఏర్పాటైతే సక్సెస్ అయ్యే అవకాశాలు.. లాభనష్టాలపై ఆరా తీస్తున్నారట.
ప్రాంతీయపార్టీలు కలిసి వస్తాయా?
దేశంలో పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లతో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కట్టేందుకు ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తాయా? ఫెడరల్ ఫ్రంట్ ఐడియా ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!