తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు జయలలిత తర్వాత చక్రం తిప్పిన నేత శశికళ. ఇప్పుడామె పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో దూసుకుపోవాలని భావించిన ఆమె ఆశలు తీరలేదు. పైగా కేసులతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చిన శశికళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని, అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించినా ఆ విషయంలో విఫలమయ్యారు. ఆ పార్టీ నేతలు ఆమె ముఖం చూడడానికి కూడా ఇష్టం పడకపోవడంతో ఆమె కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
రాజకీయాల నుంచి తప్పుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆధ్యాత్మిక యాత్రలు ప్రారంభించారు. పలు గుళ్లుగోపురాలను సందర్శించారు. మళ్లీ మనసు మారింది. మద్దతుదారులు తనను తిరిగి రాజకీయాల్లోకి రమ్మంటున్నారని, కాబట్టి మనసు మార్చుకున్నానని చెప్పారు. ఆ తర్వాత మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఇన్ని చేస్తున్నా ఆమెకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఆమె జైలుకు వెళ్లినప్పుడు అండగా ఉన్న దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీ నేతలు కూడా పట్టించుకోవడం మానేయడంతో ఏంచేయాలో తోచడం లేదంటున్నారు. ప్రస్తుతం ఆమె.. సోదరుడు దినకరన్, భర్త నటరాజన్ సోదరులు, వదిన ఇళవరసి వారసుల సూచన మేరకు శశికళ నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది. వారే ఆమెని నిర్దేశిస్తున్నట్టు అర్థం అవుతోంది.
జయలలిత మాజీ సహాయకుడు పూంగుండ్రన్‌ను పిలిచి తనకు సహాయకుడిగా పనిచేయాలని శశికళ అడిగారని, అందుకు ఆయన నిరాకరించారని కూడా సమాచారం. రాజకీయాల్లో రాణించాలని ఆమె భావిస్తున్న వేళ ….ఆమెకో ఐడియా వచ్చింది. అదే పేరులో మార్పులు. అందుకోసం ఆమె ఓ జ్యోతిష్యుడిని కలిసినట్టు తెలుస్తోంది. ఆమె జాతకాన్ని చూసిన ఆయన.. పేరుతోపాటు ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూడా మార్చాలని సలహా ఇచ్చారట. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ మార్చాలని శశికళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే పేరు మార్చుకుని, వేరే ఇంట్లోకి మారితే ఆమె అదృష్టం పడుతుందేమో చూడాలి.
Electric Bike Explosion: దారుణం.. పేలిన ఎలక్ట్రిక్ వాహనం! ఇళ్లు దగ్ధం