తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనారోగ్యంతో హస్పటల్ లో చేరారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల్లో వైరల్ ఫీవర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.
MK Stalin: డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. అవయవ దానం చేసిన దాతలకు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) నుంచి తమిళనాడును మినహాయించాలని అధికార డీఎంకే అధ్వర్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిరాహార దీక్షలు జరిగాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల్ని ఆయన కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
Nitish Kumar: ప్రతిపక్షాల ఐక్యతే లక్ష్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఈ నెల 23న నితీష్ నేతృత్వంలో పాట్నాలో విపక్షాల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తో సహా ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆర్జేడీ, ఆప్ వంటి పార్టీలు హాజరుకాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 20న నితీష్ కుమార్ తమిళనాడు పర్యటకు వెళ్లనున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ని కలిసేందుకు ఆయన వెళ్లనున్నారు. విపక్షాల ఐక్యత లక్ష్యంగా ఈ…
మనీలాండరింగ్ ఆరోపణలతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ సంస్థలను చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Amul Issue: కర్ణాటక ఎన్నికల సమయంలో రాజకీయాలను కుదుపుకుదిపేసిన అమూల్ పాల వివాదం ప్రస్తుతం తమిళనాడును తాకింది. గుజరాత్ కు చెందిన ఓ ప్రముఖ పాల కంపెనీ అమూల్, తమిళనాడు రాష్ట్రంలో పాలను సేకరించేందుకు సిద్ధం అయింది. అయితే నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అమూల్ వల్ల రాష్ట్రంలోని అవిన్ బ్రాండ్ కు ఆదరణ తగ్గే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అమూల్ పాలసేకరణను ఆపేలా ఆదేశించాలని కేంద్ర హోంమంత్రికి, తమిళనాడు సీఎం ఎంకే…
MK Stalin: రూ. 2000 నోట్లను రద్దు చేస్తూ నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది తుగ్లక్ నిర్ణయమని, మరో విపత్తుకు నాంది అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అర్వింద్ కేజ్రీవాల్, మల్లికార్జున ఖర్గే వంటి వారు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.