యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కిషన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది.. హమాలీల కొరత ఉంది.. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదు.. బస్తాలు, తర్పలిన్, సూతిల్ కూడా లేవని కిషన్ రెడ్డికి రైతులు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది.. ధాన్యం కొనుగోలు చేసినందుకు.. రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఇస్తున్నాం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైతులకు చెప్పారు.
Telangana: ఈ నెల 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు..
యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కలెక్టర్ తన పర్యటనకు రాకపోవంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన టూర్‌కు ఎందుకు రాలేదని కలెక్టర్‌ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు ఎందుకు ఆలస్యం అవుతుందని, త్వరగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం.. రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కిషన్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. రైతు డిక్లరేషన్ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. 500 వందల బోనస్.. ఓ బోగస్.. బోనస్ విషయంలో రైతులకు భరోసా లేదన్నారు. 11 నెలలు గడుస్తున్నా రైతు రుణ మాఫీ కాలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 70 లక్షల రాబడి!.. అది కూడా కేవలం 14 నెలల్లోనే..
మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వమే గందరగోళంలో ఉంది.. మూసీ యాత్ర కాదు సీఎం చేయాల్సింది.. కల్లాల్లో పర్యటించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో హామీలు అమలు చేశామని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుంది.. తెలంగాణలో ఏం సాధించారని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేస్తున్నారని సీఎంపై విమర్శలు గుప్పించారు. నిన్నటి సభలో ముఖ్యమంత్రి భాషా సరిగ్గా లేదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది.. 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తుంది.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కూడా రైతులకు న్యాయం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు, చిత్త శుద్ధి ఉంటే.. తెలంగాణలో రైతు కల్లాలోకి రావాలన్నారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు.