ఇరాన్లో ఓ కొడుకు ఘాతుకం.. తుపాకీ కాల్పుల్లో 12 మంది మృతి ఇరాన్లో (Iran Firing) ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. తుపాకీతో కాల్పులకు తెగబడడంతో తండ్రితో సహా 12 మంది బంధువులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడ్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. కుటుంబంలో కలహాలు చోటుచేసుకోవడంతో ఓ కుమారుడు విచక్షణ కోల్పోయి రైఫిల్ తీసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి, సోదరులు.. మొత్తం 12 మంది బంధువులు ప్రాణాలు వదిలారు. అనంతరం ఇరాన్‌లోని దక్షిణ-మధ్య…
కేసీఆర్, హరీశ్ రావు కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు.. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టున్న ఇబ్బందులు తొలగించడానికి గతంలో రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ కమిటీ నియమించారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ గత సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చింది.. కేసీఆర్ వేసిన కమిటీనే ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు సాధ్యమని రిపోర్ట్ ఇచ్చింది.. గతంలో వాస్తవాలతో కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టారు అని ఆయన పేర్కొన్నారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ కట్టాలనేది…
బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు.
త్వరలోనే గ్రూప్-1 పరీక్షను నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
43 మంది భారతీయుల్ని బహిష్కరించిన మాల్దీవ్స్.. చైనాపై మాత్రం చర్యలు లేవు.. మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో…
ఉద్యోగాల భర్తీలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి రాబోయే 10 సంవత్సరాల పాటు తనతో కలిసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన 13,444 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసి, ఉద్యోగ నియామకాలకు…
ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే మా ప్రయత్నమన్నారు. ఆనాటి పాలకులు తమ కుటుంబం కోసం ఆలోచించారు తప్ప నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, మా కుటుంబం 4కోట్ల తెలంగాణ ప్రజలు అని ఆయన అన్నారు. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నామని…