ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష సరైంది కాదని, ఆయన మాట్లాడే భాష పై సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉన్మాద భాష మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 90 రోజుల నుండి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పై …రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, బొంద పెడతాం, మానవ బాంబులు అయితాం, పండబెట్టి తోక్కుతాం అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు అని ఆయన ధ్వజమెత్తారు. స్థాయి లేని వారు చాల మందీ కేసీఆర్ పై మాట్లాడారని, అయిన మేము ఎన్నడు ఎవరిని ఏమీ అనలేదన్నారు. మేము ప్రభుత్వంని పడగొడుతాంమని ఎక్కడ చెప్పలేదని, రేవంత్ రెడ్డి పక్కన ఉండే వాళ్ళతోనే , రేవంత్ రెడ్డికీ ప్రమాదం ఉన్నది… కాబట్టే అలా మాట్లాడుతున్నాడన్నారు. పాలమూరు వలసలను, పచ్చగా చేసిన ఘనత కేసీఆర్ ది నిరంజగన్ రెడ్డి కొనియాడారు. పాలనపై దృష్టి పెట్టకుండా… కేసీఆర్ ను తిట్టడానికి ఉన్నట్లు కనిపిస్తుందన్నారు.
Rajnath Singh: “భారత్ యుద్ధానికి సిద్ధం”.. చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు..
ఆది శంకరచార్యుల లాగ దేశం మొత్తం రాహూల్ గాంధీ తిరుగుతుండని, ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాగానే…. దేశంలో కాంగ్రెస్ వస్తోందని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారన్నారు. పాలమూరు బిడ్డా రేవంత్ రెడ్డి కాదు… చంద్రబాబు నాయుడు తోత్తు బిడ్డ రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. తెల్లారితే, పొద్దు గుకితే నమో వేంకటేశాయ అన్నట్లు…. పొద్దాకులు కేసీఆర్ ను తిడుతున్నారని, పాలమూరు రంగారెడ్డికి జాతీయా హోదా ఇవ్వమని ఎందుకు అడగలేదన్నారు నిరంజన్ రెడ్డి. 100 యేండ్ల విధ్వంసం జరిగిందని రేవంత్ మాట్లాడుతున్నాడు…. కొంచమైనా సిగ్గు వుండాలి…10 యేండ్లలో చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాలను KRMB అప్పగించినందుకు పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్, బీజేపీకి కేంద్ర బిందువు బీఆర్ఎస్…. ఇద్దరు కలసి బీఆర్ఎస్ పైనే దాడి చేస్తున్నారన్నారు.
Garry Kasparov: చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన రష్యా..