బీజేపీ మంత్రిని పట్టపగలు కాల్చిచంపిన దుండగులు..
ఉత్తరప్రదేశ్లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని సిక్రారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధాపూర్ గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
బోధాపూర్‌లో నివాసముంటున్న మంత్రి ప్రమోద్‌కుమార్ యాదవ్ రోజూ ఉదయం జిల్లా కేంద్రానికి పని నిమిత్తం వస్తుంటారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) బ్రిజేష్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే.. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో స్కార్పియో కారులో వస్తుండగా, బోదాపూర్ గ్రామం నుంచి బయలుదేరి గ్రామ మలుపు వద్దకు చేరుకోగానే.. పెళ్లి కార్డు ఇస్తామంటూ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు ఆగంతకులు కారును ఆపారని తెలిపారు. మంత్రి కారు కిటికీ తెరువగానే ఓ దుండగుడు పిస్టల్ తీసి నాలుగుసార్లు కాల్చాడు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు పేర్కొ్న్నారు. కాగా.. గాయపడిన మంత్రి ప్రమోద్‌ను గ్రామస్థులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పేలుడు తర్వాత దుస్తులు మార్చుకుని బస్సులో ప్రయాణించిన నిందితుడు..
గత వారం జరిగిన బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు విచారణ వేగవంతమైంది. నిందితుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే విషయాలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఈ కేసులో మంచి సమాచారం లభించిందని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర గురువారం తెలిపారు. పేలుడు జరిగిన తర్వా నిందితుడు తన దుస్తుల్ని మార్చుకుని తుమకూరు పట్టణం వైపు వెళ్లినట్లు తెలిసిందని, బళ్లారి వరకు అతని కదలికలను ట్రేస్ చేసినట్లు మంత్రి ధ్రువీకరించారు.
ఏపీ అభివృద్ధిలో వెనుక పడిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు..
ఈ నెల 10వ తేదీ మేదరమెట్ల సిద్ధం సభకు సర్వ సిద్దమైంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) అన్నారు. ఇదే ఆఖరి సిద్ధం సభ.. పొలిటికల్ క్యాంపెయిన్ లో మా ముఖ్యమంత్రి ( cm jagan ) ఈ ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరిస్తారు.. అలాగే, రాబోయే ఐదేళ్ళలో చేయబోయే కార్యక్రమాల మ్యానిఫెస్టోలో సీఎం వివరిస్తారు.. 100 ఎకరాల్లో సిద్ధం సభ.. అవసరమైతే మరో 100 ఎకరాలు సిద్ధం గా ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల 20 ఎకరాల్లో పెట్టిన టీడీపీ, జనసేన సభకు లక్షల మంది వచ్చారు అని చెప్పుకున్నారు.. కానీ, మేము అలా చెప్పం.. బూత్ మేనేజ్మెంట్ పై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాం.. 2024 ఆ తర్వాత కూడా సీఎం జగన్ (cm jagan) ను ప్రాజెక్ట్ చేసుకుంటూ ఎన్నికలకు వెళ్తున్నాం.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం.. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు అభివృద్ధి ఫలాలు అందాయని విజయసాయి రెడ్డి తెలిపారు.
కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపలేదు
సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‌ఖేడ్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలను ఆపి మరీ రైతుబంధు ఇచ్చాడని, రేవంత్ మాత్రం ఏసీ రూముల్లో కూర్చోనోళ్లు ఫస్ట్…ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులు లాస్ట్ అంటున్నారన్నారు. అధికారానికి రెండు రోజుల ముందు…హామీలకు రెండేళ్లు వెనక ఉండే వ్యక్తి రేవంత్ అని హరీశ్ రావు మండిపడ్డారు. మోడీ బడే భాయ్, రేవంత్ చోటా భాయ్.
నాకు సలహాలిచ్చిన వాళ్లంతా వైసీపీలోకి వెళ్లారు..
ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham ), హరిరామ జోగయ్య ( Harirama Jogaiah )లపై జనసేన అధినేత ( Janasena chief ) పవన్ కళ్యాణ్ పరోక్ష కామెంట్లు చేశారు. నిన్న.. మొన్న నాకు సలహాలిచ్చారు.. ఎలా నిలబడాలి, ఎలా చేయాలో చెప్పారు.. సీట్లు ఇవ్వడం కూడా నాకు తెలీదా?.. పవన్ దగ్గరే ఈ ఐడీయాలన్నీ వస్తాయి.. రిజర్వేషన్ల గురించి మాట్లాడినా.. ఏం మాట్లాడినా పద్దతిగా మాట్లాడాలి.. నాకు సలహాలిచ్చిన వాళ్లంతా వైసీపీకి వెళ్లారు.. కన్వీనియెంటుగా మాట్లాడే వ్యక్తులు నాకొద్దు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా..? జగన్ ఉన్నప్పుడు మరోలా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో నేనూ ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాను.. మోడీ ( Modi )తో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నా.. నేనేం స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీ పడలేదన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రిమిసెస్ కి పోలీసులు వచ్చారు.. ప్రజాస్వామ్యయుతంగా ఉంటే నేనూ గౌరవిస్తాను.. నాతో గొడవ పెట్టుకుంటానంటే పెట్టుకోండి.. కొట్లాటకు నేనూ సిద్దమే.. గెలిచి నేనే బయటకి వస్తా.. అది గుర్తు పెట్టుకోండి అని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వెల్లడించారు.
పవన్ చేసే వ్యాఖ్యలు నాకు అర్థం కావు!
ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా విడుదల చేస్తున్నారు ఆర్జీవీ. ఈ క్రమంలో విజయవాడ ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ పవన్ కామెంట్స్ కి ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని ఏం భ్రష్టు పట్టించాడో పవన్ స్పష్టంగా చెప్పాలి అని ప్రశ్నించిన ఆయన పవన్ చేసే ఏ విమర్శకు ఆధారాలు ఉండవని అన్నారు. ఆధారాలు ఏవని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అడగరు అని పేర్కొన్న రామ్ గోపాల్ వర్మ పవన్ చేసే వ్యాఖ్యలు నాకు ఇప్పటికీ అర్థం కావని అన్నారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రాంలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా రిలీజ్ చేస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరు
కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరని హనుమకొండ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలో పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. పార్లమెంటు ఎన్నిక వేళ …..అదే మోసం పునరావృతం చేయబోతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల 50 వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని, గ్యాస్ సిలిండర్ లు కూడా అనేక నిబంధనలతో …..అర్హులను తగ్గించిందన్నారు. గృహ జ్యోతిలో 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని …..అక్కడ కూడా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ….ఉద్యోగ నియామకాలకు …..పరీక్షలు నిర్వహించిందన్నారు.
రేవంత్ అబద్ధాల హామీలు అమలు ఎప్పుడు చేస్తారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ గతంలో ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా సింహ గర్జన సభ వేదిక అయిందని, ప్రస్తుతం అబద్ధాల రేవంత్ కి వ్యతిరేకంగా కదనభేరి నిర్వహిస్తున్నామన్నారు. జేబులో కత్తెర్లు పెట్టుకుని తిరుగుతున్న అని జేబుదొంగ లాగా మాట్లాడుతున్నాడు రేవంత్ అని, మానవ బాంబులు అవుతాం అని రేవంత్ అంటున్నారు.. మీ ప్రభుత్వాన్ని కూల్చే బాంబులు ఖమ్మం బాంబు, నల్గొండ బాంబు మీ పార్టీలోనే ఉన్నాయన్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని మేము కూల్చము… ఆయన ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు కేటీఆర్. మీరిచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, రేవంత్ అబద్ధాల హామీలు అమలు ఎప్పుడు చేస్తారన్నారు.
రెండు బటన్లు నొక్కి వైసీపీని గెలిపించండి..
చిత్తూరు జిల్లాలోని పూత్తురు రూరల్ పరమేశ్వర మంగళం, తిరుమల కుప్పంలో కొత్తగా నిర్మించిన రైతు భరోసా, సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కాడని.. 2024లో మీరు తమ కోసం రెండు బటన్లు నొక్కాలన్నారు. తొలి బటన్ ఎమ్మెల్యేకు, రెండవది ఎంపీ నొక్కి వైసీపీకి అండగా నిలవాలని మంత్రి రోజా కోరింది. ప్రజల వద్దకే పాలన వాలంటరీ వ్యవస్థ ద్వారా సాధ్యమైందన్నారు. మీ సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించే విధంగా వాలంటరీ వ్యవస్థ పని చేస్తుందన్నారు. రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురు చూసే రోజులు పోయి.. ప్రతినెల ఒకటో తేదిన ఉదయానికే వాలంటీర్లు పెన్షన్ తెచ్చి ఇస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.
మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొండిలా..!
తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. మార్చి 18 నుండి ఏప్రిల్ రెండు వరకు 10 వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యా్హ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ భాష (కాంపోజిట్ కోర్సు) ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉంటుంది. సైన్స్ విషయంలో రెండు భాగాలు, పార్ట్-I ఫిజికల్ సైన్స్, పార్ట్-II బయోలాజికల్ సైన్స్, రెండు వేర్వేరు రోజులలో ఉదయం 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల కోసం 2676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు ఒక ఆలోచన చేసింది
ఢిల్లీలో కోల్, పవర్ కేంద్ర మంత్రులను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఇద్దరు కేంద్ర మంత్రులను కలిశామన్నారు. కోల్ మినిస్ట్రీ, సింగరేణికి కావాల్సిన కోల్డ్ బ్లాక్స్ గురించి సింగరేణి సమస్యల గురించి సింగరేణి అవసరాల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సింగరేణి తాడిచెర్ల సెకండ్ బ్లాక్ ఎన్నో ఎళ్లుగా పెండింగ్లో ఉందని, 2013లో ఆలస్యం చేసారని, తాడిచర్ల టు బ్లాకు ను మైనింగ్ లీస్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి కోసం.. గత పదేళ్లుగా కేంద్రం అనుమతి తీసుకోకపోవడం వల్ల తాడిచర్ల సింగరేణి బ్లాకులో మైనింగ్ చేయలేకపోయామన్నారు. తెలంగాణలో పవర్ డిమాండ్ పెరిగిన దృశ్య కోల్డ్ ప్రోడక్ట్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాడిచెర్ల గోల్డ్ బ్లాక్ టు లో దాదాపు 5 మిలియన్ టన్నుల కోన్ ఉత్పత్తికి అవకాశం ఉందని ఆయన అన్నారు.