ముఖ్యమంత్రి రేవంత్ సీఎం హోదా లో మాట్లాడినట్లు లేదు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పక్క పెద్దన్న అంటూనే.. ఆ మరుసటి రోజే మోడీ – కేడీ అంటున్నారు.. ఇది ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. నిన్నటి సభలో రేవంత్ టీమ్ మాట్లాడింది చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తొస్తున్నాయన్నారు. మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇవన్నీ ఎవరి సింపతి కోసమే మాట్లాడుతున్నారో చెప్పాలని, మీ పాలనా మీద మీకే నమ్మకం లేదు… అందుకే దింపేస్తారంట.. దింపేస్తారంట అంటున్నారన్నారు. కాంగ్రెస్ లోంచి ఎవరైనా మరో ఎకనాథ్ షిండే లా 40 మంది ఎమ్మెల్యే ల తో వస్తే అప్పుడు దిగిపోతుందేమో అంటూ ఆమె విమర్శించారు.
BC Janardhan Reddy: బీసీ జనార్థన్ రెడ్డి దాతృత్వం.. దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల పంపిణీ..!
అంతేకాకుండా..’కాంగ్రెస్ లో రేవంతే మరో ఏక్నాథ్ షిండే అవ్వొచ్చు అనే విమర్శలు వస్తున్నాయి. గతం లో కేసీఆర్ కూడా అహకారపూరిత మాటలు మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నారో చూసాం. బీఆరెస్, బీజేపీ ఒక్కటే అంటూ తప్పుడు ప్రచారం చేసి అధికారం లోకి వచ్చింది… మీకు గుర్తులేదా..? 60 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ మహిళలకు మరుగుదొడ్లు కట్టించి ఇచ్చాము. రేవంత్ కు దమ్ముంటే ఇచ్చిన అరు గ్యారంటీలు అమలు చేసి చూపండి. మోడీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డి కి లేదు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిందో లేదో అప్పుడే అహంకారం వచ్చిందా..? మోడీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తే మైలేజీ వస్తుంది అనుకుంటున్నావేమో ఖాబార్ధార్ రేవంత్ రెడ్డి. నోటికొచ్చినట్లు మాట్లాడితే వెంటపడి తరిమేస్తాం. మొన్న మోడీని కలిసిన అపవాదాన్ని తొలగించుకునేందుకు రాజకీయ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. సీఎం రేవంత్ రెడ్డి, వాళ్ల పార్టీ అభ్యర్థి ఇద్దరు నాగర్ కర్నూల్ పార్లమెంట్ వాసులే… ఇక్కడికొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ది చెప్తారు.’ అని డీకే అరుణ వ్యాఖ్యానించారు.
Love Me Teaser: పక్కన బేబీని పెట్టుకొని దెయ్యంతో రొమాన్స్ అంటావేంటి భయ్యా ..