అన్నయ్య మూసేస్తే తమ్ముడొచ్చాడు.. మంత్రి తీవ్ర విమర్శలు.. ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి చెల్లుబోయిన వేణు మండిపడ్డారు. చిరంజీవి పార్టీ…
పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదును అందజేశారు. రెండు తెలుగు…
KRMB కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. ప్రజలను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సర్కార్కు లొంగిపోయిందన్నారు. విభజన చట్టంలోని ప్రతీ అక్షరం నన్ను అడిగే రాశారని కేసీఆరే చెప్పారని, కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి…
Chiranjeevi: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సన్మానానికి నాంది పలికింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని అరుదైన వేడుకను తెలంగాణ ప్రభుత్వం చేసింది. పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మాన సభను నిర్వహించింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించిన విషయం తెల్సిందే.
CM Revanth Reddy With Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుల్లో చిరంజీవి ఒకరు. చిరు సినీ జీవితం ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు.
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆటో డ్రైవర్ల సమస్యపై తన లేఖలో ప్రస్తావించారు. ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతోందన్నారు. ఆటోలు ఎక్కేవాళ్లు లేకపోవడంతో తమ కుటుంబం గడవని…
ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. త్వరలో లక్షమంది మహిళలకు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని త్వరలోనే అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా.. గూడాలకు రోడ్లు, నాగోబా అభివృద్ధి కోసం పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. అమర వీరుల కుటుంబాలకి రూ.5 లక్షల ఇచ్చి అండగా…
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆ రెండు హామీల అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు కేస్లాపూర్లోని నాగోబా దర్బార్లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. అలాగే.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.
Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.