ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగాడివైతే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చెయ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటిఆర్ మాట్లాడ్డం ఆయన రాజకీయ అవివేకానికి నిదర్శనం అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలిచాడు.. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచాడు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యాడు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఒక్కడే కాదు ఆయనతో పాటు 65 మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు అని పేర్కొన్నారు.
Read Also: AI Mission: భారత AI మిషన్ కోసం రూ. 10,372 కోట్లు.. ఆమోదం తెలిపిన క్యాబినెట్..
మీకు ( బీఆర్ఎస్ పార్టీ నేతలకు ) సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే భయం పట్టుకుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి తెలిపారు. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.. మీవి వంద తప్పులు అవుతున్నాయి.. శిశుపాలిడిని కృష్ణుడు చంపినట్టు మిమ్మల్ని కూడా జనం రాజకీయంగా చంపేస్తారు అని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా జనానికి మీరు చేసిన మోసాలు, తప్పులు తెలుసుకొని ప్రభుత్వానికి సహకరించాలి.. లేకపోతే జనం మిమ్మల్ని బోంద పెడతారు అంటూ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.