Hyderabad: నగరం శిఖలో డబుల్ డెక్కర్ కారిడార్.. రేపు నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి (NH)44పై దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడ్లకోయ జంక్షన్ సమీపంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు నేడు నాంది ప్రస్థానం ప్రారంభం కానుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్-ఆదిలాబాద్ మీదుగా సాగే ఎన్‌హెచ్-44పైన జంట నగరాల్లో విపరీతమైన వాహన రద్దీతో నగర ప్రజలు, ప్రయాణికులు నిత్యం పలు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్‌లో రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్‌కు కంటోన్మెంట్ ప్రాంతంలోని నిబంధనలు ఆటంకంగా మారాయి. సమస్య పరిష్కారానికి గత పాలకులు చిత్తశుద్ది చూపకపోగా, వ్యక్తిగత అహం, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించడంతో రక్షణ శాఖ నుంచి అనుమతులు సాధించలేకపోయారు. 2019లో మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఆ మరుక్షణం నుంచే ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో రహదారుల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.
Also Read
పార్లమెంట్‌లో రక్షణ శాఖ స్టాండింగ్ సభ్యునిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ కమిటీ సమావేశాల్లోనూ కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల విషయంలో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై చర్చను కొనసాగించేవారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో ఈ అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి అయిదో తేదీన స్వయంగా కలిసి రాజధాని నగరంలో కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల విస్తరణ రక్షణ శాఖ భూములు తమకు అప్పగించాలని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన రక్షణ శాఖ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అంగీకరిస్తూ మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
* ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇలా..
ఎన్‌హెచ్-44పై సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్‌బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫాం రోడ్డు వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్ పొడవు 5.320 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.600 కి.మీ ఉంటుంది. మొత్తం 131 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా (0.248 కి.మీ. వద్ద), (0.475 కిలోమీటర్ వద్ద) రెండు చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు… ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణం మరింత క్షేమంగా, వేగంగా, సుఖవంతంగా సాగనుంది.
* ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ప్రయోజనాలు..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్ జంక్షన్ వద్ద రోజుకు సగటున 1,57,105 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ ఫర్ డే -పీసీయూ) పయనిస్తుంటే, ఓఆర్ ఆర్ జంక్షన్ సమీపంలో 72,687 వాహనాలు పయనిస్తున్నాయి. ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో నిత్యం వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. తరచూ రహదారి ప్రమాదాలతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసర సమయాల్లో గమ్యాన్ని చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఒత్తిడి, అసహనానికి గురవుతున్నారు. వాహన రద్దీతో గంటలకొద్ది ట్రాఫిక్ నిలిచిపోతుండడంతో ఇంధనానిని భారీగా వ్యయం అవుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలిసిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గుతుంది. ప్రమాదాల సంఖ్య తగ్గిపోనుంది.
తాజావార్తలు
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?