Hyderabad Marathon 2024: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 13వ ఎడిషన్ ఈరోజు (ఆదివారం) లాంఛనంగా స్టార్ట్ అయింది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది.
త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభమెప్పుడంటే..? వందే భారత్ స్లీపర్ రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు శుభవార్త. వందే భారత్ రైళ్ల విజయవంతమైన తర్వాత.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే యోచిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించాలని భావిస్తున్నారు. కాగా.. వందే భారత్ స్లీపర్ రైలు వందే భారత్ సిరీస్ యొక్క మూడవ వెర్షన్. ఈ సిరీస్ రైళ్లలో చైర్-కార్…
కొత్త సిటీ నిర్మాణం, రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు కీలక అడుగు వేసింది. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) పేరుతో కొత్త కార్యాచరణకు దిగింది. ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, పనులను దీని పరిధిలోకి చేర్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్లో 19 ప్రాజెక్టులపై…
నేపాల్లో నదిలో పడిపోయిన 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు.. నేపాల్ దేశంలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిందని సమాచారం. ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి నేపాల్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. జిల్లా…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు గతంలో ఇచ్చిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే గద్దర్ అవార్డుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కమిటీకి చైర్మన్గా ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు, వైస్ చైర్మన్గా ప్రముఖ నిర్మాత దిల్ రాజును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్…
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగో ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ భేటీ అయ్యారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎంను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక…
మా తమ్ముడు దందాలు చేసుకోవచ్చు కానీ.. సెబి చైర్మన్ షేర్లు కొనుక్కోవద్దా రేవంత్ రెడ్డి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం మీద దేశ ప్రజాస్వామ్యం మీద, కోర్ట్ ల మీద రాహుల్ గాంధీ కి నమ్మకం లేదని, బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్త పై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు రఘునందర్ రావు. అదానీ నీ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి…
సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడని, ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయ్యిందా అని ఆయన ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ మంత్రులే రుణమాఫీ మొత్తం కాలేదని ఒప్పుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ…