చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడన్నారు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశామని, ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు…
ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారని, బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ అని, సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్ గాంధీ అని, పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్…
Sandra Venkata Veeraiah: కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదని అన్నటు చేస్తున్నారు ఈ మంత్రులు అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు.
ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆయన మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.
ఇంతకి ఇది హైడ్రా నా హై డ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేసిందని ప్రశ్నించారు. అప్పుడు అధికారులు అనుమతులు యే ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు.
టూరిజాం అంటే కొన్ని పట్టణాలకే పరిమితమైందని, కాలక్రమేణా చారిత్రాత్మక కట్టడాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు మంత్రి సీతక్క. గుర్తింపు కు నోచుకోక ఇబ్బందులు పడుతున్నామని, పల్లెలో ఉన్న ఆరోగ్యం, ఆనందం, పర్యాటకం ఎక్కడ ఉండదన్నారు మంత్రి సీతక్క. పల్లెలను అభివృద్ధి పథం లో తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. గోదావరి పర్యాటక ప్రాంతాలు ఇక్కడా ఉన్నాయి… ప్రకృతి సంపదను కాపాడుకుంటూ టూరిజాన్ని డెవెలప్ చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.. భవిష్యత్ తరాలకు కలలను,కళా కాండలను కాపడికోవాలని…
భూవివాదాలను త్వరగా పరిష్కరించండి.. మంత్రి లోకేష్ ఆదేశాలు ప్రజా సమస్యల పరిష్కారం ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, 28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు క్యూ కట్టారు ప్రజలు.. అయితే, భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని…