కేసీఆర్ నీ కుర్చీ, నీ పదవి, నీ అమ్మనాయన ఇవ్వలేదు అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నీ పదవి ప్రజల ఓట్లకు పుట్టింది.. గుడిసెల్లో ఉన్నవాళ్లు ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు అను భావించి పొద్దున్నే లైన్లో నిలబడి ఓట్లు వేస్తారు.. ఎన్ని కోట్ల ఆస్తులున్న కూడా ఓటు హక్కు మాత్రం ఒక్కటే.. నువ్వేం నిజం నవాబు కాదు.. నీకు అధికారం ఇచ్చింది 2023 వరకే అని ఆయన పేర్కొన్నారు. ఓటు వేసిన ప్రజలకు కేసీఆర్ యముడు లెక్క తయారయ్యాడు..
Read Also: Raashii Khanna: ది సోల్ ఆఫ్ సత్య.. ఎంత ముద్దుగా పాడావ్ బంగారం
మనం కడుతున్న పైసలకు కాపలా కుక్కాలా ఉండాల్సిన కేసీఆర్ నేనే ఓనర్ అంటున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. అటుకులు బుక్కి, కడుపు కట్టుకొని ఉద్యమం చేసినని చెప్పే కేసీఆర్ కి, ఆయన కుటుంబానికి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొంత ఇంటి కల మేము నిజం చేసి చూపిస్తాము.. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికీ పెన్షన్ అందిస్తామన్నారు.
Read Also: Chandrayaan-3: చరిత్ర సృష్టించిన భారత్.. చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతం
కేసీఆర్ కి 10 ఏళ్లు అధికారం ఇచ్చాము ఇంకా చాలు.. ప్రజల కష్టాలు పోవాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలి అని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఈ దుష్టంతాలను బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి అని ఆయన తెలిపారు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కొన్నిచోట్ల రెండో ఫ్లోర్ వరకు నీటిలో మునిగాయి.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టారు అని ఆయన పేర్కొన్నారు. యువకుల్లారా ఆడబిడ్డల్లారా భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తుంది.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నారు.. మీ సొంత ఇంటి కల మేము నిజం చేసి చూపిస్తామని ఈటెల అన్నారు.
Read Also: Minister Niranjan Reddy: అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ తపన
భారత రాష్ట్ర సమితి నాయకుల దృష్టి కబ్జా భూముల మీద అయితే.. భారత జనతా పార్టీ నాయకుల దృష్టి ప్రజల బాగోగుల మీద అని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కి 10 ఏళ్లు అధికారం ఇచ్చాము ఇంకా చాలు.. ప్రజల కష్టాలు పోవాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలి అని ఆయన తెలిపారు. తెలంగాణలో మీ ఆశీర్వాదంతో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని ఈటెల రాజేందర్ అన్నారు.