CM KCR: ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సెక్రటేరియట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఎంతో కళాత్మకంగా, అన్ని సదుపాయాలతో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయంలో మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. నూతన సచివాలయంలో మూడు మందిరాలు గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీక అని అభివర్ణించారు. ఇవాళ మధ్యాహ్నం 12:10 నిమిషాలకు తెలంగాణ సెక్రటేరియట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన దేవాలయం, చర్చి, మసీదులను గవర్నర్ తమిళి సై దర్శించుకోనున్నారు. మధ్నాహ్నం 12:35కు సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం దేవాలయం, మసీదు, రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించి 12:45కు చర్చిలో కేక్ కట్ చేయనున్నారు.
Read also: Kollywood: మా మీద ఈ ఏడుపు ఎందుకు బ్రో?
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు సచివాలయంలో దేవాలయం, మసీదు, చర్చి నిర్మాణాలు చేపట్టగా, ఆలయ ప్రారంభోత్సవాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. గురువారం స్తథాపూజ, ప్రతిష్టాపన హోమం, మహాస్నపనం (తిరుమంజనం), వేదపఠనం, మహాలక్ష్మీ యాగం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం చండీ యాగం, ప్రాణ ప్రతిష్టాపన హోమం, ధ్వజస్తంభం, యంత్ర, ప్రాణ ప్రతిష్ఠ, వేదోక్తాంగ ప్రాణ ప్రతిష్ఠ, ముక్కోటి ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, శివాలయ తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం, శివాలయ ఇదోళోచ్ఛాచనం తదితర కార్యక్రమాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతలను ప్రతిష్ఠించనున్నారు.
Manipur Violence: మణిపూర్‌లో హింసకు కాంగ్రెస్సే కారణం: సీఎం బీరేన్ సింగ్