వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వయోపరిమితిని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించింది సర్కార్.. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది.. ఇకపై అర్హులైన 57 ఏళ్ల వారందరికీ కొత్త పెన్షన్లు అందనున్నాయి. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.. అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. గతంలో.. ఏజ్ లిమిట్‌ను 57 ఏళ్లకు కుదిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.