బ్రేకింగ్: రేపటి నుంచి దళిత బంధు అమలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు… దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. అయితే, మొదటగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు.. దానిపై కొన్ని రాజకీయ విమర్శలు లేకపోలేదు.. కానీ, రేపటి నుంచే దళిత బంధు పథకం ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలను గుర్తించామని… తక్షణమే దళిత బంధు పథకం అమలు చేస్తామని.. రేపటి నుంచే మీ బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేస్తామంటూ వారికి శుభవార్త వినిపించారు.
ఇక, సరైన విధానాలు పాటించకపోవడం మూలంగానే దళితులు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. దళితులు అణిచివేతకు, వివక్షకు గురయ్యారన్న ఆయన.. దళితుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఇటీవల దళితబంధు పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ పథకాన్ని విఫలం కానివ్వొద్దని కోరారు. మొదట మీ గ్రామంలోనే అమలు చేస్తున్నాం… ఇక్కడ విఫలం అయితే పథకం ఫెయిల్ అయినట్టు అవుతుందని… అందుకోసం ఆ మొత్తాన్ని ఆలోచించి ఖర్చు చేయాలన్నారు.. పైసకు పైసా పెరుగుతూ పోవాలని తప్ప… చిన్నా చితక పనులకు ఖర్చు చేయొద్దన్నారు సీఎం కేసీఆర్. ఆ రూ.10 లక్షలు ఖర్చు చేయొద్దు.. వాటిపై సంపాదించింది మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. మరోవైపు.. దళితుల్లో ఐకమత్యం రావాలని పిలుపునిచ్చారు.. వాసాలమర్రి గ్రామస్తులు ఒప్పుకుంటే, పాడుబడిన పాత గ్రామాన్ని కూలగ్గొట్టి కొత్త వాసాలమర్రిని నిర్మించుకోవాలని అన్నారు.
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!