ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు మాజీమంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ లో గెలవడానికి రూ. 150 ఇప్పటికే పంపిణీ చేశారని ఆరోపణలు చేశారు. తాను సీరియస్ రాజకీయ నాయకుణ్ణి అని.. డ్రామా మాస్టర్ ని కాదన్నారు. తన కున్న ఆప్షన్ పాదయాత్ర నేనని… తాను పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. 3,4 రోజులు వాకింగ్ మొదలు పెట్టి ఆ తర్వాత పాద యాత్ర మొదలు పెడతానని స్పష్టం చేశారు.
5 రోజులుగా తాను బాగుండాలని పూజలు చేసి దీవించిన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు ఈటల. 18 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేసి వివిధ హోదాలో ఉన్న వారికి విజ్ఞప్తి చేస్తున్నానని.. ఉద్యమ సహచరులు కనుమరుగయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మానుకోటలో రాళ్లు వేసిన వారికి ఎమ్మెల్సీ పదవి అప్పగించారని..2018 ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారని ఆరోపించారు. తనను ఓడించడానికి పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టారని.. ఆ కుట్రలను, కుతంత్రాలను తిప్పికొడదామని పిలుపు నిచ్చారు.