సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండనున్నట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. 11వ తేదీ నుండి హుజూరాబాద్ లో 7 సభలు. మండల కేంద్రాల్లో సభలు పెట్టనున్నట్లు స్పష్టం చేసారు. ఈటల మీద విచారణ జరిపిన నివేదికలు ఏమయ్యాయి అని ప్రశ్నించిన ఆయన ఈటల బీజేపీ లో చేరడానికి కేసీఆర్ కారణం అని పేర్కొన్నారు. ఈటల బీజేపీ లో చేరిన వెంటనే విచారణలు ఎందుకు ఆగిపోయాయి. హుజురాబాద్ నియోజక వర్గ అభ్యర్థిత్వం కోసం నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎన్నిక తేదీ ప్రకటన వచ్చిన వెంటనే అభ్యర్ధి ప్రకటన ఉంటుంది అని అన్నారు.