ఇందిరా భవన్ లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… మనకు పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్, కేసీఆర్ దళితులను సీఎం చేస్తా అని అన్నారు. మోసం చేశారు అన్నారు. దళిత, గిరిజనుల హక్కులను తెలంగాణ లో కాలరాస్తున్నారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగింది. హరిత హారం పేరుతో కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకున్నారు. ఎస్డీ, ఎస్టీ లకు హక్కులు, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గిరిజన మంత్రులను, ఎమ్మెల్యేలు లను…
దళిత బంధుతో దళితులను దగా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి.. కేసీఆర్ దళితుల గురించి ఎన్నో చెప్పారు.. దళితులని సీఎం చేస్తా అన్నారు.. లేదంటే తల నరుక్కుంటా అన్నారన్న ఆమె.. డిప్యూటీ సీఎం రాజ్యను ఎందుకు కేబినెట్ నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. సబ్ ప్లాన్ ఫండ్స్ కోసం ఏడేళ్లుగా రూ.85,913 కోట్లు కేటాయించారు.. కానీ, ఏడేళ్లలో ఖర్చు చేసింది మాత్రం రూ.47,685 కోట్లు మాత్రమే.. మిగతా…
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఈ మీటింగ్‌లోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు…ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.…
ప్రజా దీవెన పాద యాత్రలో భాగంగా నేడు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మంత్రులకే దొరకని సీఎం ఎంపీటీసీ, సర్పంచ్ లతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మన దెబ్బ అలా ఉంది అన్నారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యే లు నా మీదకు వస్తున్నారు. ఇది గడ్డి పోస కాదు, గడ్డపార. పొలిసులకు కూడ వారి మనసులో ఈటెల రాజేందర్ గెలువాలని ఉంది. నేను అందరికి సహాయం చేసే వాడిని.…
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి .. నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు పెద్దిరెడ్డి ఇప్పటికే తెలిపారు.కేసీఆర్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు పెద్దిరెడ్డి.హుజూరాబాద్‌లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. read also : భారత్ ఘోర పరాజయం.. సిరీస్…
ప్రజల స్పందన, బిజెపి కు ఆదరణ చూసిన తరువాత ఆందోళన చెందిన సీఎం కే.సి.ఆర్ “దళితబంధు”పథకాన్ని తీసుకు వచ్చారు అని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ జయంతిని గౌరవించని సీఎం దళితుల మీద “ఫేక్ ప్రేమ” చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫేక్.. ఆయన పథకాలు ఫేక్ అని తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. “ఫేక్ ఐడి” కార్డులు, తప్పుడు ప్రచారాలు చేసే స్థాయికి దిగజారారు. కోట్ల…
తెలంగాణ సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’పై ప్రత్యేకంగా ఫోకప్ పెట్టారు.. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమావేశం కూడా నిర్వహించారు సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి.. హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. రాజకీయంగా లబ్ధిపొందడానికే ఈ పథకం తెచ్చారని ఆరోపిస్తున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారం…
ఉపఎన్నికల షెడ్యుల్ విడుదల కంటే ముందే హుజురాబాద్‌లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలు సర్వత్రా చర్చగా మారుతున్నాయి కూడా. పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గెలుపు కోసం అధికార పార్టీ అయితే.. అన్ని వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌశిక్ రెడ్డిని…