తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ రవీందర్ నాయక్.. దళిత బంధు పథకాన్ని స్వాగతించిన ఆయన.. వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్లు ఉంది కేసీఆర్ వైఖరి అంటూ ఎద్దేవా చేశారు. దళిత గిరిజనులను… తెలంగాణ పేదలను మోసం చేసి హుజురాబాద్ లో గెలిచేందుకు ఈ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ఓ చీటర్.. ఏడేళ్లుగా అందరినీ మోసం చేస్తున్నారని విమర్శించారు.. తెలంగాణ మేధావులు. రాజకీయ నాయకులు దీనిపై…
మేం ట్రెండును ఫాలో అవ్వం.. సెట్ చేస్తాం.. అంటూ ఓ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ చెబుతారు.. ఇది సరిగ్గా సరిపోయే వ్యక్తం ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావే.. తెలంగాణ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా అయనే ట్రెండ్ సెట్టర్. అయన ఏం చేసినా వినూత్నమే… మెదట అసాధ్యం అనిపించేలా అయన పథకాలుంటాయి.. తర్వాత అందరు ఫాలో అయ్యేలా రిజల్ట్ ఉంటుంది. పరిపాలనలో అయినా రాజకీయాల్లో అయినా……
తాను ఎప్పుడూ పేదల ప్రజల పక్షాన కొట్లాడే బిడ్డనేనని .. సీఎం కేసీఆర్‌తో అనేక అంశాలపై పెనుగులాడానని గుర్తుచేసుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణ కాలనీలో ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. పదవుల కోసం పెదవులు మూయొద్దని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అనేక అంశాలపై ఆయనతో పెనుగులాడానని.. బయటికి చెప్పకపోయినా, అంతర్గతంగా కొట్లడానని..…
రాష్ట్రంలో రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం అయిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రూ.25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్ లో భాగంగా రుణమాఫీ చేసారు. తొలిరోజు 1309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేసారు. మొత్తం రూ.3 కోట్ల 27 లక్షల 91 వేల 186 ఖాతాలలో జమ చేసారు. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రూ.50…
దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని అన్ని దళితు కుటుంబాలకు విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.. రైతు బంధు తరహాలో దళితబంధు అమలు చేస్తామని.. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు.. అయితే, దళితబంధు కాదు.. చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతావు అంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. దళితులకు సంబందించిన 30వేల కోట్ల రూపాయలని కమీషన్ల…
ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళితబంధు పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రైతు బంధు తరహాలో దళిత బంధు కూడా అందరికీ వర్తింస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూమి ఉన్నవారికి రైతు బంధు వచ్చినట్టే.. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుందని వెల్లడించారు.. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.. ఆ…
గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే పంట రుణాల మాఫీ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడతల వారిగా రైతు రుణమాఫీ చేస్తోన్న సర్కార్.. ఇవాళ్టి నుంచి 50 వేలలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది. ఇప్పటికే మొదటి విడతలో 25 వేల లోపు రుణం తీసుకున్న 3 లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ చేసింది. ఈసారి ఏకంగా 6 లక్షల మందికిపైగా రైతులకు లబ్ది చేకూరనుంది. స్వాంత్రంత్ర వేడుకల్లో దీనిపై మరోసారి ప్రకటన…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ హుజురాబాద్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును ప్రారంభించనున్నారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటోంది. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.…
గత మూడు నెలలుగా హుజురాబాద్ కి చీకటి అధ్యాయంగా పోలీసులు నిర్బంధం చవి చూస్తున్నది. నా రాజీనామా తర్వాత ఏ నిబంధన ప్రకారం ఏ చట్టం ప్రకారం ఇతర ప్రాంతాల వారిని ప్రోటోకాల్ సంభందము లేకుండా ఇంఛార్జ్లు వచ్చారు. హుజురాబాద్ ప్రజలపై తోడేళ్ళు గా విరుచుకుపడుతున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటల మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తలపై నాయకులపై నిరంతరం ఫోన్ ట్యాపింగ్ లు చేయడం నిఘా పెట్టడం చేస్తున్నారు…
రేపు జరుగనున్న ‘దళితబంధు పథకం’ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ వేదిక ముస్తాబైంది. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో వేదికను తయారుచేశారు. వేదికపైకి 15 దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలతో పాటుగా పలువురు ఎంపీలు, మంత్రులు కూర్చోనున్నారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఈ సభ జరుగనుంది. ఇక త్వరలోనే హుజూరాబాద్…