జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరి పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… జమ్మూకాశ్మీర్ లో 370 కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాం..దాన్ని రద్దు చేసుకొని, భారత రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావటం కీలక ఘట్టం..నా జీవితంలో ఇది కీలక నిర్ణయం.. క్యాబినెట్ మంత్రిగా నాకు మోడీ అవకాశం కల్పించారు. ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు…
తెలంగాణకు హరిత హారం స్పూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, సీడ్ బాల్స్ తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు’’ జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కెసిఆర్ చేతులమీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అందుకున్నారు. వారి కృషిని సీఎం కెసిఆర్ అభినందించారు.…
ఈ ప్రభుత్వాన్ని బెదిరించినా, ప్రశ్నించినా మార్పు రాదు.. గద్దె దించడమే ఏకైక పరిష్కారం అంటూ.. కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డారు బీజేపీ నేత మురళీధర్‌రావు.. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాలు పంచుకుందని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సహకారం ఉందని.. కానీ, గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సరైన దారిలో వెళ్లడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింది… ఉద్యమాల మీద లాఠీ దెబ్బలు పెరిగాయి… అధికార పార్టీ…
తెలంగాణ క్యాబినెట్‌లో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కతోబోతుందా? ఒకరు కాదు.. ఇద్దరికి అవకాశం ఉంటుందా? ఎవరెవరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? కేబినెట్‌లోకి దళిత ఎమ్మెల్యేలను తీసుకుంటారా? తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ సర్కారు దళిత బంధు స్కీమ్‌ను అమలులోకి తీసుకొచ్చింది. మంత్రివర్గంలో కూడా ఇద్దరు దళిత సామాజికవర్గ ఎమ్మెల్యేలకు చోటుదక్కే అవకాశం…
తెలంగాణ రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రుల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఐటీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లా ల ఎంపిక చేశామన్నారు. ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని… ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే,…
నిరు పేదలు ఏ కులంలో ఉన్న ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… అత్యధికంగా జైలుకు పోయి వచ్చిన బిడ్డ ఈటల. నేను హుజురాబాద్ లో 90శాతం అభివృద్ది చేశాను. మిగిలిన 10శాతం కూడ నా రాజీనామాతో పూర్తి అవుతుంది అని తెలిపారు. నాలాంటి బక్క పలుచని వ్యక్తి మీద కేసీఆర్, అతని అల్లుడు, కుటుంబం, తొత్తులు,…
దళిత బంధు కింద కేసీఆర్ ఇస్తామని చెప్తున్న 10 లక్షలు ఆయన సొంత డబ్బు కాదు అని చెప్పిన భట్టి విక్రమార్క ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఒక భాగం మాత్రమే అన్నారు. దీన్ని ఏదో ఒక్క నియోజక వర్గంలో పరిమితం చేయొద్దు. రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేయాలి అని తెలిపారు భట్టి. కో ఆర్డినెటర్లు నియోజక వర్గాలలో ఈ విషయాలను బాగా విస్తృత ప్రచారం చేయాలి అని సూచించారు. నియోజక…
కొత్తగా వచ్చిన పథకాలు చేతినిండా వారికి పని కల్పిస్తున్నాయి. కానీ.. వైరిపక్షం చేసే విమర్శలకే కౌంటర్లు ఇవ్వడం లేదట. కొందరే స్పందిస్తున్నారట. మిగతా వారి సంగతేంటో తెలియడం లేదు. వాళ్లది మౌనమా.. వ్యూహమా కూడా అర్థం కావడం లేదట. టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఈ చర్చే సాగుతోంది. ప్రవీణ్‌కుమార్ విమర్శలకు కొందరే కౌంటర్ ఇచ్చారా? తెలంగాణలో కొత్తగా రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ కలర్స్ మారుతున్నాయి. మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్…
రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ఎత్తుగడలు సహజం. ఎప్పుడు ఏం అంశం కీలకమవుతుందో ఊహించలేం. ఎప్పుడెలా పరిష్కారం లభిస్తుందో చెప్పలేం. ఆ విధంగా చర్చల్లోకి వచ్చిందే తెలంగాణ CMO. ఒక్క దళిత అధికారి కూడా లేరన్న విపక్షాల విమర్శలకు విరుగుడు మంత్రం వేసింది అధికారపక్షం. అదేంటో ఈస్టోరీలో చూద్దాం. సీఎంవోపై విమర్శలకు ప్రభుత్వం విరుగుడు మంత్రం! హుజురాబాద్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో అనేక అంశాలు చర్చల్లోకి వస్తున్నాయి. సమయం.. సందర్భాన్ని బట్టి ప్రత్యర్థులను ఇరుకున…