నేడు హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ హుజురాబాద్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును ప్రారంభించనున్నారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటోంది. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కేసీఆర్ సభ జరగనుంది. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. కాగా… హుజూరాబాద్ నియోజక వర్గంలో ఐదు మండలాలున్నాయి. ఇందులో రెండు మున్సిపాలిటీలు. దళితబంధు కోసం ఒక్కో మండలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. మున్సిపాలిటీల నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒక్కో లబ్దిదారుడికి పది లక్షల విలువైన యూనిట్‌ను అందించబోతున్నారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇళ్లందకుంట, కమలాపూర్‌లలో ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తైంది.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!