తెలంగాణలో రేపటి నుండి రైతు రుణమాఫీ ప్రారంభం కానుంది. రూ.2005.85 కోట్ల రుణమాఫీ చేయనున్నారు. దీని ద్వారా రూ.50 వేల వరకు రుణాలున్న 6,06,811 మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. అయితే నేడు రుణమాఫీపై ట్రయల్ రన్ చేస్తున్నారు. రూ.25 వేల పైబడి రూ.25,100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ చేస్తున్నారు. ఈ నెల 30 వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. అయితే…
వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు,తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. జన్మదిన…
సిరిసిల్ల జిల్లాలో గతంలో చూడలేని అభివృధ్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్… 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. సిరిసిల్ల జిల్లాలో సమారు లక్షా 16వేల 577 మంది రైతులకు 812 కోట్ల రూపాయలను ముందష్తు పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలలో ప్రభుత్వం నేరుగా జమ చేసిందన్నారు.. ఋణమాఫీ సంబంధించి జిల్లాలో 25 వేల రూపాయలు ఋణం తీసుకున్న 10,289 మంది రైతులకు…
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం.. హాట్ టాపిక్‌గా మారింది. అయితే, సర్కార్ సైతం.. ఈ పథకాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తోంది. దళిత సమాజానికి ఈ పథకం గురించి వివరిస్తూ.. ప్రత్యేక పాటలు రూపొందించి ప్రచారం కల్పిస్తోంది. ఇప్పుడెక్కడ చూసినా.. దీనిపైనే చర్చ జరుగుతోంది. దళితుల సాధికారత కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి అద్భుతమైన పాటలతో… అంతే స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది…
గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని… జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని వివరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనమిదవ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు. రాష్ట్రంలో జాతీయ జెండా ఎగరవేస్తే కేసులు బుక్ చేస్తారు, జైలుకు పంపుతారు, రౌడి షీట్లు వేస్తారని దేశానికి తెలియాలి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని అందరికీ తెలియాలి. ఎన్ని కేసులైనా బుక్ చేసుకోండి జెండా ఎగర వేసేందుకు, ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. ఏ దేశంలోనూ ,ఏ రాష్ట్రంలోనూ జాతీయ పథాకాన్ని ఎగరవేసేందుకు అనుమతి కోరరు. గోషామహల్ నియోజక…
దళిత బంధు అందరికీ అందించక పోతే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నున్న ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలని కోరారు. 10 లక్షల రూపాయలు దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలన్నారు. వాటి మీద కలెక్టర్, బ్యాంక్ మేనేజర్ ల అజమాయిషీ తీసివేయాలన్నారు. అందరికీ అందించకుండా…
హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈనెల 16న నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పాలన పరమైన అంశాల్లో కేసీఆర్ వేగం పెంచారు. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ సిద్దిపేట, మెదక్, వరంగల్ జిల్లాలను సందర్శించారు. వాస్తవానికి ఈనెల మొదటి వారంలో నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటనకు వెళ్లాల్సింది ఉంది.…
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేయాలని దళిత బంధు పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు సీఎం కేసీఆర్.. అయితే, దళిత బంధుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు వద్దు అని చెబుతున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత బంధు ఆపించే కుట్రలు జరుగుతున్నాయని.. దళిత బంధు అమలు అయితే…
దళిత బంధు అమలుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న సర్కార్.. పైలట్ ప్రాజెక్టుగా ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.. ఈ నెల 16వ తేదీ నుంచి హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 16వ తేదీ నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.. ఇక, ఇప్పటికే హుజూరాబాద్…