రాష్ట్రంలో రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం అయిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రూ.25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్ లో భాగంగా రుణమాఫీ చేసారు. తొలిరోజు 1309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేసారు. మొత్తం రూ.3 కోట్ల 27 లక్షల 91 వేల 186 ఖాతాలలో జమ చేసారు. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రూ.50 వేల రూపాయల లోపు గల రైతుల రుణాలన్నీ మాఫీ చేయనుంది ప్రభుత్వం. రైతుబంధు నిధుల పంపిణీ మాదిరిగానే రుణమాఫీ నిధులు కూడా జమ అవుతాయి. రైతుల ఖాతాలలో జమయిన నిధులను బ్యాంకర్లు ఇతర పద్దుల కింద జమ చేసుకోవద్దు. రుణాలు మాఫీ అయిన రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు అందజేయాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.