తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో బీసీ కమిషన్‌లో సభ్యుడిగా ఉన్న వకుళాభరణం కృష్ణమోహన్‌ను ఇప్పుడు చైర్మన్‌ను చేశారు సీఎం కేసీఆర్… ఇక, బీసీ కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్రను నియమించారు.. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పించనుంది సర్కార్.. ఇక్కడో…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితులపై ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యం లోనే మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. దళితబంధు…
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్ల తో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో…
టీకాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటోంది. దళిత గిరిజన దండోరా సభలతో పాటు…దళిత బస్తీలను సందర్శించనుంది. సభలు నిర్వహించడంతో… కార్యకర్తల లో జోష్ వస్తుంది కానీ…అసలు జనం మనసులో ఏముందో తెలియాలంటే నేరుగా జనంలోకి వెళ్లాలని డిసైడయ్యింది. అందుకే.. ఈనెల 24, 25న జరిగే…దీక్షలకు తోడుగా… దళిత వాడల లో పర్యటించాలని నిర్ణయం తీసుకుంది. అది కూడా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లి గ్రామం నుంచే ప్రారంభించనుంది. తన దత్తత గ్రామానికే సీఎం…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి అడుగుపెట్టాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు. పంపుల నుంచి దూసుకెళ్లిన గోదావరి నీళ్లు.. గలగలమంటూ మల్లన్నసాగర్‌లోకి అడుగుపెట్టాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో..అధికారులు కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో సంబరాలు జరుపుకొన్నారు. మల్లన్నసాగర్‌లో ప్రస్తుతం 10 టీఎంసీల…
సీఎం కేసీఆర్ పై మరోసారి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూడు చింతలపల్లి గ్రామాన్ని కెసిఆర్ దత్తత తీసుకొని ఏం చేయలేదని మండిపడ్డ రేవంత్ రెడ్డి.. అలాంటి ది తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. అందుకే మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష పెట్టనున్నామని తెలిపారు. ఈ దీక్ష తో కెసిఆర్ గ్రామానికి ఎం చేశాడో ప్రజలకి చూపిస్తామన్నారు. దీక్ష సమయంలో నైట్ దళితుల ఇంట్లోనే పడుకుంటానని తెలిపారు. ఈటెల రాజేందర్ బీజేపీ లో…
హుజురాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉప ఎన్నికలు టీఆర్ఎస్‌కు కొత్త కానప్పటికీ …హుజురాబాద్ బై ఎలక్షన్ ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని పార్టీల కంటే ముందే మండలాల వారీగా ఇంఛార్జిలను నియమించి.. వారిని రంగంలోకి దింపింది. ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ లకు అప్పగించారు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్. ఇటు కేసీఆర్ స్వయంగా ఎప్పటికప్పుడు హుజురాబాద్ లోని రాజకీయ పరిస్థితులపై ఆరా…
సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జీతాలు ఇవ్వలేని సీఎం కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తాడో చెప్పాలని… ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ పనిచేస్తాడని నిప్పులు చెరిగారు. దళితబంధు పేరుతో మరోసారి దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని… 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను తీవ్ర అన్యాయమన్నారు. పాలన గాలికొదిలేసి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నాడని… కరోనా…
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం గా సిఎం తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు సుఖ శాంతులతో ఉండాలని సీఎం…
తెలంగాణ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలి. ధరల పెరుగుదల పై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయండి అని ప్రచార కమిటీ ఛైర్మెన్ మధు యాష్కీ అన్నారు. రాజకీయంగా ఎదగడానికి పనిచేస్తుంది. కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నాడు. రాజకీయ లబ్ధికోసమే దళిత బంధువు.. ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. దళితలకు 3ఎకరాల భూమి ఏమైంది. దళిత బంధు కాదు.. బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా ప్రకటించాలి. బీజేపీ…