సెప్టెంబర్ 1న జరగబోయే కేఆర్‌ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అనుసరించాల్సిన వ్యూహం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకురాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో… సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్…
మూడు చింతల పల్లిలో దీక్ష విరమించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. వాడు చింతమడక చీటర్.. ఈ మూడు చింతలకు కట్టి చీల్చాలంటూ వ్యాఖ్యానించిన ఆయన.. మూడు చింతలపల్లిలో ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన ఇళ్లే ఉన్నాయన్నారు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లడానికే రోడ్డు పెద్దగా చేసిండు.. రోడ్డుపైకి చేయడంతో ఇళ్లు కిందికి అయిపోయాయని.. వాన కాలంలో వాన నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయిఅని ఆవేదిన వ్యక్తం చేశారు.. ఊరిలో ఇంతవరకు కమ్యూనిటీ…
20 ఏళ్ళు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లు. కేసీఆర్ కు 20 నెలల భయం పట్టుకుంది. మొదటి సారి కేసీఆర్ లో భయం కనిపిస్తుంది అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మూడు చింతల పల్లి దీక్ష వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం తరువాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రీఫ్ చేయలేదు. ఆఖరుకు కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్…
ఇది పాదయాత్రల సీజన్. తెలంగాణలో మరో పాదయాత్రకు ముహూర్తం కుదిరింది. ఇందిరా శోభన్ తాజాగా ఈ లిస్టులో చేరిపోయారు. ఇటీవలషర్మిల పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆమె మీడియా ముందుకు వచ్చారు. తన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో వివరించారు. ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటమే ఆమె టార్గెట్. టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానలపైనే తన పోరాటమంటున్నారు ఇందిరా శోభన్. ఆమె తలపెట్టిన పాదయాత్ర పేరు ఉపాధి భరోసా…
రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… సెప్టెంబర్ మొదటి వారంలో గ్రామ కమిటీలు, రెండోవారం లో మండల కమిటీలు, మూడో వారం లో జిల్లా కమిటీలు.. అలాగే అక్టోబర్ లో రాష్ట్ర కమిటీ లు పూర్తిచేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. దళిత బందు పై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలని కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ న్యాయం చేస్తుంది. అన్ని వర్గాలకంటే దళితులు వెనుకపడ్డారు కాబట్టే మొదట వారికోసం దళిత బంధు తెచ్చాము. అన్ని వర్గాలకు న్యాయం…
నేడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ దత్తత గ్రామంలో సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో రేవంత్ మాట్లాడుతూ… పేదల ఇండ్లు కట్టిస్తా అని ముల్క నూరులో ఇప్పటికీ ఇండ్లు కట్టించ లేదు. ఆడపిల్ల ల ఆత్మగౌరవం పోతుంటే ఏం చేస్తోంది ప్రభుత్వం. 150 మంది ఇంకా రోడ్డు మీద బతుకుతున్నారు. లక్ష్మ పూర్ కి దరని వెబ్ సైట్ లో గుర్తింపే లేదు. కేశవరం లో డబుల్ బెడ్ రూం ఇచ్చినవా… డబుల్…
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన దూకుడును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇంద్ర వెళ్లి, రావిలాల లో దళిత,గిరిజన ఆత్మ గౌరవ సభలు నిర్వహించగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో దళిత,గిరిజన గౌరవ ఆత్మ గౌరవ దీక్ష చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం లోపే ఈ దీక్షను ప్రారంభించనున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయితే… ఈ దీక్షను ఈ రోజు, రేపు రెండు…
హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ.. మళ్లీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ బాస్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇవాళ టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కాబోతోంది. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పై ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అలాగే . గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు.. పార్టీ శాఖల ఏర్పాటు కోసం షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. దళితబంధు విషయంలో పార్టీ…
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ విషయం పై వైద్య పంచాయితీరాజ్ మున్సిపల్ శాఖలను ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున, ముందస్తు నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, అధికారులు, వైద్యశాఖ, మున్సిపల్ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా వుండాలని, అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు…
కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన స్కూళ్లు, విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోన్నాయి.. అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునర్ ప్రారంభించాలని ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30లోగా సానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను ఆదేశించారు సీఎం…