పాలమూరు మహిళా సమాఖ్యలకు సీఎం కేసీఆర్ ప్రశంస…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు హరిత హారం స్పూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, సీడ్ బాల్స్ తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు’’ జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కెసిఆర్ చేతులమీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అందుకున్నారు. వారి కృషిని సీఎం కెసిఆర్ అభినందించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పచ్చదనాన్ని సాధించే దిశగా రికార్డు స్థాయిలో, 10 రోజుల్లో 2 కోట్ల పది లక్షల సీడ్ బాల్స్ ను ఒక నెల కాలంలో తయారు చేసి కొండలు గుట్టల ప్రాంతాల్లో వెదజల్లడం ద్వారా పచ్చదనం అభివృద్ధికి పాటుపడుతున్న పాలమూరు జిల్లా మహిళా సంఘాల కృషిని సీఎం అభినందించారు.
తెలంగాణకు హరిత హారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని స్వయం సహాయక బృందాలు గత ఏడాది నెలకొల్పిన 1.18 కోట్ల సీడ్ బాల్స్ తయారీ రికార్డును అధిగమించి ఈసారి కేవలం 10 రోజుల్లో 2.08 కోట్ల సీడ్ బాల్స్‌ను తయారు చేసి గిన్నీస్ రికార్డు సృష్టించాయి. ఈ 2.08 సీడ్ బాల్స్‌ను జిల్లాలోని వివిధ ప్రదేశాలలో వెదజల్లారు. ఇక సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న సాగునీటి జలాలతో నేడు ఎటు చూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నదన్నారు. బీడు భూములు రాల్లు గుట్టలకే ఇన్నాల్లూ పరిమితమై వున్న పాలమూరు పచ్చదనంతో తన రూపు రేఖలను మార్చుకుని, వినూత్న రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుండడం సంతోషకరమన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!