మూడు చింతల పల్లిలో దీక్ష విరమించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. వాడు చింతమడక చీటర్.. ఈ మూడు చింతలకు కట్టి చీల్చాలంటూ వ్యాఖ్యానించిన ఆయన.. మూడు చింతలపల్లిలో ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన ఇళ్లే ఉన్నాయన్నారు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లడానికే రోడ్డు పెద్దగా చేసిండు.. రోడ్డుపైకి చేయడంతో ఇళ్లు కిందికి అయిపోయాయని.. వాన కాలంలో వాన నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయిఅని ఆవేదిన వ్యక్తం చేశారు.. ఊరిలో ఇంతవరకు కమ్యూనిటీ హల్ కూడా కట్టలేనది మండిపడ్డ రేవంత్.. దత్తత తీసుకున్న గ్రామంలో ఒక్క పని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, రెండు కోట్లు పలికే భూములు కూడా గుంజుకున్నారని విమర్శించారు.
మోసం, కేసీఆర్ రెండు ఒక్కటేనని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.. హుజురాబాద్‌లో ఓటమి భయం పట్టుకుందన్న ఆయన.. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టమంటే.. ఎవ్వరు రాలే.. దీంతో.. కేటీఆర్ వచ్చి పెట్టిండు.. ఆ ప్రెస్ మీట్ కు కూడా ఏ మంత్రి వచ్చి పక్కకు కూల్చేలేదన్నారు.. ఇక, తెలంగాణ సమాజం.. కేసీఆర్ కుటుంబానికి మస్తు చేసింది.. తెలంగాణ కోసం కొట్లాడిండు అని రెండు సార్లు సీఎంను చేసిండ్రు.. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు? అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి.. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరిస్తే.. తెలంగాణ దొంగల పాలైందన్న ఆయన.. రాష్ట్రాన్ని అడవి పందుల్లా.. దోచుకుంటున్నారని మండిపడ్డారు.. దళిత, గిరిజనులందరికి బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్.. కాంగ్రెస్ దండోరా సభలతో.. కేసీఆర్ అనే ఎలుక బయటికొచ్చిందని సెటైర్లు వేశారు.. కేసీఆర్.. జపాన్ ఎలుక లాంటి వాడు.. ప్రమాదాన్ని ముందే గ్రహించి బయటికొచ్చిండు అని ఎద్దేవా చేసిన ఆయన.. కేసీఆర్ నీ టైం ఐపోయింది.. ఇక నీవు ఇంటికేనని వ్యాఖ్యానించారు రేవంత్‌రెడ్డి.