రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… సెప్టెంబర్ మొదటి వారంలో గ్రామ కమిటీలు, రెండోవారం లో మండల కమిటీలు, మూడో వారం లో జిల్లా కమిటీలు.. అలాగే అక్టోబర్ లో రాష్ట్ర కమిటీ లు పూర్తిచేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. దళిత బందు పై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలని కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ న్యాయం చేస్తుంది. అన్ని వర్గాలకంటే దళితులు వెనుకపడ్డారు కాబట్టే మొదట వారికోసం దళిత బంధు తెచ్చాము. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం అని అన్నారు. అలాగే నవంబర్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీ ఉంటుంది. టీవీ ఛానల్ డిబేట్ లలో ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పి కొట్టండి అని సూచించారు. వచ్చే నెల 2 న తెలంగాణ భవన్ ఢిల్లీ లో శంకుస్థాపన జరుగుతుంది. ఇక దళిత బంధు పై ప్రజలను చైతన్యం చేయాలి. దళిత బంధు ను ఉద్యమం లాగా చేయాలి. రానున్న 20 ఏళ్లు కూడా మనమే అధికారం లో వుంటాం.. దశల వారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. కొత్తగా జిల్లా అధ్యక్షులు నియమిస్తాం అని స్పష్టం చేసారు.