దీక్షకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు… రేపు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షకు దిగనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటన ప్రకారం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై నిరసన తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ప్రకటనలో పేర్కొన్న మోత్కుపల్లి… దళిత సాధికారితకోసం సభలు, సమావేశాలు నిర్వహించి దళితుల సంక్షేమం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఉపన్యాసాలు ఇవ్వడం,…
కరీంనగర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించారు.. ఇక, సమీక్ష తర్వాత హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయిన తెలంగాణ సీఎం.. సిద్దిపేట జిల్లాకు రాగానే మల్లన్న సాగర్ ప్రాజెక్టును పరిశీలించారు.. తొగుట మండలం తుక్కుపూర్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను హెలికాప్టర్ నుంచి వీక్షించారు.. కాగా, ఇప్పటికే ఆరు మోటార్ల ద్వారా మల్లన్న సాగర్ లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.. ఈ ఏడాది పది టీఎంసీల…
మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్ చివరకు సీఎం కేసీఆర్ పైకి మళ్లింది… గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మల్లా రెడ్డిపై మరోసారి భూ కబ్జా, అవినీతి, అక్రమ ఆరోపణలు చేశారు.. ఈ సందర్భంగా ఇవిగో ఆధారాలంటూ కొన్ని పత్రాలను కూడా బయటపెట్టారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్‌పై స్పందించిన ఆయన.. సవాల్ మల్లారెడ్డికి కాదు.. కేసీఆర్‌కే విసురుతున్నా అన్నారు.. నేను గెలిచిందే మల్లారెడ్డి మీద కదా? అని ప్రశ్నించారు..…
మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇవాళ వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు.. సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారన్న ఆయన.. అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని గుర్తుచేశారు. మంత్రి మల్లారెడ్డిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న రేవంత్.. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. ఓ రియల్ ఎస్టేట్…
తన చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో దళిత బంధు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. రెండున్నర గంటలపాటు దళిత బంధుపై చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన…
కరీంనగర్ కలెక్టరేట్ చేరుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిన్న రాత్రి కరీంనగర్ వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడే బస చేశారు. ఇక ఇవాళ ఉదయం.. కరీంగనర్ జిల్లాలోని ఓ టీఆర్‌ఎస్ నేత కూతురి వివాహానికి హాజరయ్యారు. అక్కడ నూతన వధువరులను ఆశీర్వదించారు సీఎం కేసీఆర్. అనంతరం అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ కలెక్టరేట్ చేరుకున్నారు. ఇక కలెక్టరేట్ లో మరికాసేపట్లో దళిత బంధు పథకం పై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఇది ఇలా ఉండగా… సీఎం…
కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… నన్ను చూస్తే గజగజ వణుకుతున్నారు. నా సభలకు కరెంట్ కట్ చేస్తున్నారు. అదే నేను అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కి కరెంట్ చేస్తా అని తెలిపారు. హుజురాబాద్ ఎన్నిక వస్తేనే దళితుల మీద ప్రేమ పుట్టుకు వచ్చింది. ట్రాక్టర్లకు ఓనర్లు కాదు.. కంపెనీలకు ఓనర్లను చెయ్యాలి. అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండి.. తొడ గొట్టి మాట్లాడతారా. మీ కాలేజీల్లో విద్యార్థులకు…
యాదాద్రి జిల్లా తుర్కపల్లి(మ) రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్ష లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి. వాసాలమర్రి కి సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చిన అడ్డుకుంటాం. దళిత బంధుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బొంద తొడుకుండు ఆ బొంద మేమే పుడుస్తాం. సీఎంఓ రాహుల్ బోజ్జ చోటు ఇవ్వగానే దళితలందరికి ఇచ్చినట్టా అని ప్రశ్నించారు.…
ఐదారేళ్ల గ్యాప్ తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం దేనికి సంకేతం? జిల్లాల్లో ఎవరికైనా కత్తెర పడబోతుందా? నిన్నమొన్నటి వరకూ తామే సుప్రీం అనుకున్నవారికి చెక్ పడినట్టేనా? గులాబీ పెద్దల ఆలోచనలో వచ్చిన మార్పునకు కారణం ఏంటి? అధికారపార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకానికి నిర్ణయం! టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి.పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా…