నేడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ దత్తత గ్రామంలో సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో రేవంత్ మాట్లాడుతూ… పేదల ఇండ్లు కట్టిస్తా అని ముల్క నూరులో ఇప్పటికీ ఇండ్లు కట్టించ లేదు. ఆడపిల్ల ల ఆత్మగౌరవం పోతుంటే ఏం చేస్తోంది ప్రభుత్వం. 150 మంది ఇంకా రోడ్డు మీద బతుకుతున్నారు. లక్ష్మ పూర్ కి దరని వెబ్ సైట్ లో గుర్తింపే లేదు. కేశవరం లో డబుల్ బెడ్ రూం ఇచ్చినవా… డబుల్ బెడ్ రూం ఇచ్చినవా అని ప్రశ్నించారు. అలాగే నేను చెప్పింది అబద్దం అయితే… నేను రాజీనామా చేస్తా అన్నారు. అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇచ్చినా.. లక్ష ఋణ మాఫీ చేసినా.. పంచాయతీ పెడదాం. అన్ని కులాల పెద్దలను కూడా పిలిచి… చర్చ చేద్దాంఅని అన్నారు.
మేము ఇక్కడ సమావేశం పెట్టినం అని కేసీఆర్ రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టినారు . మేము అడగకుండానే ఈ ఊర్ల ను దత్తత తీసుకున్నవూ . మరి ఎందుకు అభివృద్ధి చెయ్యవు . పల్లె కనిపించని కుట్రల లో బంది అయ్యింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో తెలంగాణ తల్లి బంది అయ్యింది అన్నారు. కాంగ్రెస్ 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇచ్చింది.. కానీ కేసీఆర్.. పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్ష అప్పు పెట్టిండు. నీళ్ళు జగన్ కి….నియామకాలు నీ ఇంటికి వచ్చాయి. ఎన్నికలు వచ్చాయని హుజూరాబాద్ లో దళిత బందు పెట్టినవు. కాంగ్రెస్ అధికారం లో వుండగానే సబ్ ప్లాన్ తెచ్చింది అని పేర్కొన్నారు.