హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్‌కు చెంపచెల్లుమనేలా ఓటర్లు తీర్పు ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదని.. ఉద్యమకారులని ఈ ఎన్నిక ద్వారా నిరూపించారని షర్మిల కొనియాడారు. కేసీఆర్ గారడీ మాటలు, పిట్టకథలు జనం నమ్మరని… ఇకనైనా…
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. ఈ గెలుపుతో అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్య 3కి చేరిందని కమలం పార్టీ నేతలు పొంగిపోతున్నారు. అయితే నిజంగా హుజురాబాద్‌లో బీజేపీ గెలిచిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. సాంకేతికంగా మాత్రమే బీజేపీది గెలుపుగా భావించాలి. దీనికి కారణం ఈటల రాజేందర్. నిజానికి ఈ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య జరగలేదు. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్‌గానే సాగింది. అందుకే ఈ గెలుపును చూసి బీజేపీ…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్‌ఎస్ పార్టీ ఊహించని షాక్ తగులుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ పార్టీనే లీడ్ లో ఉంది. అయితే.. సీఎం కేసీఆర్ దళిత బంధ, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టిన శాలపల్లి గ్రామంలోనూ టీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. శాలపల్లి తో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం లోకి వచ్చారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్…
‘విజయగర్జన‘ సభను వాయిదా వేసింది టీఆర్ఎస్ పార్టీ.. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్.. అయితే, వరంగల్‌లో ఇవాళ జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ సభను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సీఎం కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని…
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ. బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ మాట్లాడుతూ… హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలపడానికి ఎంతో కష్టపడ్డరు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జయంతి రోజున కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో… ఆయన బిజీ షెడ్యూలును ప్రజలకు తెలియజేయాలన్నారు. నైజాం నవాబు పాలించిన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలుపకుంటే చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యే వాడా అని ప్రశ్నించిన…
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ పోలింగ్ పోరు ముగిసింది. గెలుపెవరిదినే దానిపై టెన్షన్ నెలకొంది. ఎవరికి వారే తమ అంచనాలు వేసుకుంటున్నారు. హుజురాబాద్ ఫలితం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలిస్తే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఈటల వైపు మొగ్గు కనిపిస్తోందంటున్నారు. అన్ని పార్టీలు హుజురాబాద్ ఉపఎన్నికలను 2023లో జరగబోయే ఎన్నికలకు ప్రయోగంగా భావిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే…
తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్ ఎన్నికలు కాక రేపాయి. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయి వుంది. అయితే రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార పార్టీపై మండిపడ్డారు. ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించింది. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి…
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా ఎవరూ అజాగ్రత్తగా వుండవద్దన్నారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్. కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రాజేంద్రనగర్‌లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీఎస్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు…
న్నికల్లో భారీ పోలింగ్ జరగడం అభ్యర్ధుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. 2018 ఎన్నికల సందర్భంగా హుజురాబాద్‌లో 2,26,000 పైచిలుకు ఓట్లు ఉండేవి. తాజాగా ఉపఎన్నికలో కొత్తగా నమోదు చేసుకున్నవారికి ఓటు హక్కు కల్పించారు. దీంతో పది వేల ఓట్లు పెరిగి… ఆ సంఖ్య ఇప్పుడు 2,36,873కు చేరింది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలున్నాయి. ఇల్లంతకుంట మండలంలో మిగతా మండలాల కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మండలంలో కేవలం 24,799 మంది ఉండగా.. హుజురాబాద్ మండలంలో…
టీఆర్ఎస్ చీఫ్.. ఏపీలో పార్టీ పెడతారో లేదో కానీ.. ప్లీనరీలో ఆయన చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార వైసీపీ కౌంటర్లపై కౌంటర్లు వేస్తోంది. రాజకీయ లబ్ధికోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు.. ఈ రగడను అనేక మలుపులు తిప్పుతోంది. మాటల దాడి ఇక్కడితో ఆగుతుందా? మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో పార్టీలు ఉన్నాయా? రెండు రాష్ట్రాలను కలిపేస్తే సమస్యే ఉండబోదన్న పేర్ని నాని..! టీఆర్‌ఎస్ ప్లీనరీలో గులాబీ బాస్.. సీఎం కేసీఆర్ చేసిన…