తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఈ రోజు 7 మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన హుజురాబాద్ ఫలితం, పెట్రోల్, డీజిల్ ధరలు, వరి కొనుగోల్లు, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు వంటి అంశాలపై తీసుకోనున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్రాలు కూడా తమ వ్యాట్ ను తగ్గించి ప్రజల భారం తగ్గించాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్…
తెలంగాణలో ఒకేసారి ఏడుగురు పెద్దల సభకు వెళ్లనున్నారు. ఎవరా ఏడుగురనేదే ఇప్పుడు నడుస్తున్న చర్చ. అయితే, హుజురాబాద్ ఫలితం తర్వాత టియ్యారెస్ ఎమ్మెల్సీ లెక్కలు మారుతున్నాయనే టాక్ ఉంది. దీంతో, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యేదెవరు ? సిట్టింగ్‌ల్లో మళ్లీ ఎవరు? కారు పార్టీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఒకేసారి ఖాళీ అయ్యాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి , కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, ఫరీదుద్దీన్, బోడకుంటి…
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వానికి వ్యాట్ సెగ తగులుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని విపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఎన్డీయే పాలిట ప్రభుత్వాలు ధరలు తగ్గించాయి. వ్యాట్ ని భారీగా తగ్గించాయి. దీంతో బీజేపీయేతర పార్టీలు అధికారంలో వున్న చోట ధరలు తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ డిమాండ్ తీవ్రత పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం…
తెలంగాణ వచ్చాక నిరుద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయన్నారు టీజేఏస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చంట్ అసోసియేషన్ భవనంలో నిరుద్యోగుల ఆత్మస్థైర్య సదస్సులో పాల్గొన్నారు కోదండరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 3శాతం వున్న నిరుద్యోగం ఏడున్నర ఏళ్లలో మూడింతలు 8శాతానికి పెరిగింది. తెలంగాణలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే నిరుద్యోగం తగ్గిందా… పెరిగిందా ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పాలి. తెలంగాణలో ఇప్పటి వరకు భర్తీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 80 వేలలోపే, కానీ సీఏం…
తెలంగాణలో యువతను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. యువత ఉద్యమం కోసం బలిదానం చేసుకుంది… ఇప్పుడు ఉద్యోగాల కోసం చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడకుండా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసం తాము ఉద్యమం చేయడం లేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడారో గుర్తుచేస్తున్నామన్నారు. అప్పుడేం చెప్పావ్.. ఇప్పుడేం చేస్తున్నావ్ అన్నారు బండి సంజయ్.…
రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని… అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ మేరకు ఎన్ని టీఏంసీల…
80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మతతత్వమవుతుందా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా? 370 ఆర్టికల్ రద్దు జరిగేదా? అని తెలిపారు. నల్లకుంటలోని శంకర మఠానికి వెళ్లారు బండి సంజయ్. రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని… చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరమని తెలిపారు. కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి…
ఈనెల 14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం…
ఉన్నవి ఆరు పదవులు…ఆశావహులు మాత్రం భారీగానే ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ…ఆ జిల్లా నుంచి ఎవరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తుంది ? ఎవరికి ఏ అంశం కలసి వస్తుంది ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడిదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయ్యింది. ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలు…అధికార పార్టీకే దక్కుతాయి. దీనితో టిఆర్ఎస్ పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలు,…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చాటారు ఈటల.. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగినా.. కాంగ్రెస్ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఏకంగా 60 వేలకు పైగా ఓట్లు వస్తే.. ఈ సారి మాత్రం చతికిలపడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్.. ఇలా మరికొందరి నేతలపై…