టీఆర్ఎస్ ‘విజయగర్జన‘ సభ వాయిదా.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘విజయగర్జన‘ సభను వాయిదా వేసింది టీఆర్ఎస్ పార్టీ.. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్.. అయితే, వరంగల్‌లో ఇవాళ జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ సభను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సీఎం కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో ముక్త కంఠంతో చేసిన అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
Read Also: అయోధ్య, వేలాంకని, అజ్మీర్‌కి ఉచిత యాత్ర.. కేజ్రీవాల్ హామీ..!
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
కాగా, నాటి ఉద్యమ రథసారథిగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ’ అనే నినాదంతో కేసీఆర్ ప్రారంభించిన ధీక్షా దివస్’ నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు తమ అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన ధీక్షా దివస్ రోజే జరపాలని వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు, చారిత్రాత్మక తెలంగాణ విజయ గర్జన సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేసుకొని ముమ్మరంగా కృషిచేస్తూ ఏర్పాట్లల్లో నిమగ్నమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు కేసీఆర్.. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను నవంబర్ 29వ తేదీకి మార్చుకోవాలని తెలిపారు.. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు టీఆర్ఎస్ అధినేత.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!