రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ. బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ మాట్లాడుతూ… హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలపడానికి ఎంతో కష్టపడ్డరు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జయంతి రోజున కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో… ఆయన బిజీ షెడ్యూలును ప్రజలకు తెలియజేయాలన్నారు. నైజాం నవాబు పాలించిన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలుపకుంటే చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యే వాడా అని ప్రశ్నించిన బండి అలానే ఉంటె ఇప్పుడు చంద్రశేఖర్ రావు పేరు చాందు పాషా గా ఉండేదని అన్నారు. నిన్న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవ పోతున్నాం అని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు అధికారం అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో ఓటుకు ఆరు వేల నుండి పదివేల వరకు ఖర్చు పెట్టారని మండిపడ్డారు.