హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్‌ఎస్ పార్టీ ఊహించని షాక్ తగులుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ పార్టీనే లీడ్ లో ఉంది. అయితే.. సీఎం కేసీఆర్ దళిత బంధ, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టిన శాలపల్లి గ్రామంలోనూ టీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
శాలపల్లి తో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం లోకి వచ్చారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని తెలంగాణ ప్రతి పక్షాలు ముందు నుంచి మండిపడుతున్నాయి. అయితే… హుజురాబాద్ కౌంటింగ్ విషయానికి… వచ్చే సరికి… ఓటర్లు కూడా టీఆర్ ఎస్ పార్టీకి మొగ్గు చూపలేదు. శాలపల్లి తో పాటు.. కౌశిక్ రెడ్డి మరియు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రామాల్లోనూ… టీఆర్‌ఎస్ పార్టీ పరాభవం తప్పలేదు. వారి గ్రామాల్లోనూ బీజేపీ పార్టీకి లీడ్ లభించింది.