కేసీఆర్ లేని తెలంగాణ ను ఊహించుకోలేము. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మన నాయకునిపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మనం ఎందుకు ఊర్కోవాలి.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బిజెపి,కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు లేవు అని ప్రశ్నించారు. మా రైతు ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ వ్యవసాయ కరెంట్ మోటర్ల కాడ మీటర్లు ఒప్పుకోలే. ప్రభుత్వరంగ సంస్థలన్ని మోడీ సర్కారు…
తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారని, దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్ళించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తమకు కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడు నీళ్లు కూడా వాడుకోబోమని ఎప్పుడో చెప్పామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎంత దూరమో…
రైతుల పాలిట తెలంగాణ సీఎం రాబందులా మారారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… వరి బంద్ పథకాన్ని కేసీఆర్ స్టార్ట్ చేసిండు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రైతులు వరి పండించకుండా ఏమి పంట వేయాలో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయలేదు.. ముఖ్యమంత్రి కన్ఫ్యూజ్ లో ఉంటాడు.. ఈయన కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేసిన బండి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి…
భారతీయ జనతా పార్టీ నేతలకు సవాల్ విసిరారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. సాగు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి సవాల్ విసిరారు.. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంట అయిన కొంటాం అని ఉత్తరం తీసుకురావాలన్నారు.. ఒక వేళ లెటర్ తీసుకురాకపోతే పదవులకు బండి సంజయ్, కిషన్ రెడ్డి…
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు ఆశ.. నిరాశల మధ్య ఊగిసలాడారా? పార్టీ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సభ ఉంటుందని.. ఆ తర్వాత ఉండదని తేలడంతో ఆలోచనలో పడ్డారా? ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు.. కేడర్‌లో ఉత్సాహం నింపాయా? కేసీఆర్ సభతో గెలుపు ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని చూశారు..! హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచార గడువు ముగిసే టైమ్ దగ్గర పడింది. ప్రధానపార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారపార్టీ టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేలా పావులు కదుపుతోంది. కీలక ఎన్నికల బాధ్యతల్లో…
తెలంగాణ రాష్ట్రంలో మరొ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు సమాచారం అందుతోంది. డాక్టర్ వినయ్ నేతృత్వం లో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్ లో తన మద్దతు దారులతో డాక్టర్ వినయ్ భేటీ అయ్యారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో అందరికి న్యాయం జరగాలనే డిమాండ్ తో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా వినయ్ కుమార్ అడుగులు వేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి…
బీజేపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మధువని గార్డెన్ లో పురప్రముఖుల సమావేశం జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. అందులో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుస్తున్నారన్న టాక్ ఇప్పటికే వచ్చింది. హుజురాబాద్ గురించి తెలిసిన ప్రపంచంలోని అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఈటల గెలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేతిలోకి వస్తుంది. దీన్ని…
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఏపీ, తెలంగాణలో పొలిటికల్ సెగలు.. పొగలు కక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ ప్లీనరీ నుంచి కీలక కామెంట్స్ చేశారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్. ఏపీ పిలుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇంతకీ కేసీఆర్‌ను ఏపీ నుంచి ఎవరు పిలిచారు? ప్లీనరీలో చేసిన కామెంట్స్ వెనక ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడ ఉందా? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..! ఏపీ పిలుస్తోందన్న కేసీఆర్ మాటల వెనక చాణక్యం?…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిపై చర్యలు తీసుకునేందుకు సమయాత్తం అవుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వ్యాక్సిన్ వేసుకోని… వారికి ఫించన్ మరియు రేషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. నవంబర్ 1 వ తేదీ లోగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని..లేని యెడల… వ్యాక్సిన్ తీసుకోని కుటుంబాలపై వేటు వేసేందుకు అడుగులు వేస్తోంది టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచనల…
తెలంగాణ పేరు వినిపిస్తేనే నిర్బంధం నుంచి గొంతు పిక్కటిళ్లేలా జై తెలంగాణ నినాదం ఎత్తుకున్న వరకు ఉద్యమనేతగా… తెలంగాణ సాధకుడిగా అశేష ఖ్యాతి సాధించిన కేసీఆర్.. మరో ఘనత సాధించారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమంతో తెలంగాణ సాధించి.. స్వరాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్ మరో సారి అరుదైన ఘనతను సాధించారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో.. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దేశంలో.. అత్యధికాలం పాటు ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగిన నేతల జాబితాలో చేరారు కేసీఆర్. హైదరాబాద్…