ఆ రోజు మీటింగ్ లో కేసీఆర్ కు సహాయ సహకారాలు అందించిన ఒక్కరి పేరు కూడా ప్రస్తావించక పోవడం దుర్మార్గం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ ను మెడలు పెట్టి బయటకు పంపించాడు…. హరీష్ రావు ను హుజూరాబాద్ లో చెట్టుకు కట్టేసాడు. హరీష్ రావును ఉరి పెడతాడేమోనని భయం భయంగా బ్రతుకుతున్నాడు.. కేజీ టు పిజి ఉచిత విద్య పై , ఉన్నత విద్యకు నిధుల కేటాయింపు పై చర్చకు సిద్ధమా, ఫీజు…
హైదరాబాద్ వేదికగా జరిగిన గులాబీ పండుగ (టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ) సమావేశాలు ముగిశాయి… దాదాపు 8 గంటలపాటు వివిధ అంశాలపై చర్చ సాగింది.. మొత్తం 7 తీర్మానాలపై ప్లీనరీలో చర్చించింది ఆమోదం తెలిపారు.. అందులో కీలకమైనది పార్టీ బైలాస్‌లో పలు సవరణలకు ప్లీనరీ ఆమోదించడం.. పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించేలా తీర్మానం చేశారు.. దీంతో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చినట్టు అయ్యింది.. ఇక, బీసీ గణన,…
హుజురాబాద్ అసెంబ్లీ బై ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి.. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని, కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గు చేటు అంటూ ఫైర్ అయిన రాములమ్మ… హరీష్ రావు దళిత…
టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. మహిళలను ఆకాశానికెత్తారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ రాజ్యం బాగుంటుందన్నారు. మహిళల్లో ప్రతిభావంతులు ఉంటారని, మహిళలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ముందు వరుసలో నిలబడాలన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదని, చేసిందే ఇక్కడ…
కరీంనగర్ జిల్లా అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు. అక్కడ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ… ఈటలకు ఈ ఎన్నికలో భారీ మెజారిటీ రావాలి. ఏ సర్వే చూసినా… ఈటలదే విజయం అని పేర్కొన్నారు. ఓడిపోతారు అని ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం వల్లనే కేసీఆర్ హుజూరాబాద్ మీటింగ్ కు రావడం లేదు అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఏప్రిల్ 27కి పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు…
అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథిలుగా ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… యువత మీరే ఎన్నికల ప్రచారం భుజాలమీద వేసుకొని పనిచేయాలి. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టిన కూడా మన యువత భయపడడం లేదు. 27 తరువాత ఊర్లలో మీరే ఉంటారు. కెసిఆర్ డబ్బులు, మద్యం సీసాలు పాతర వేయల్సింది మీరే. మీరు కొట్టే దెబ్బ ఊహకు కూడా అందకూడదు. చరిత్రలో మంచి రాజులు, చెడ్డ…
సీఎం కేసీఆర్… మహానాయకుడు అంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైనా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్ రావు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ…
కడప జిల్లాలో ఈ నెల 30న జరగనున్న బద్వేల్ ఉప ఎన్నికలపై బీజేపీ సీరియస్ అయింది. కడప నగరంలోని ఆర్.అండ్.బీ అతిథి గృహంలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు భీష్మ కుమార్ ను కలిసి బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యులు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. ఎన్నికల పరిశీలకులను కలిసిన వారిలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వున్నారు.…
కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తి స్తుందని.. ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుందని… మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిందని.. 425 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ లు టిఆర్ఎస్ కు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.…
దళిత బంధు పిటిషన్ పై హైకోర్టు లో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. దళిత బంధును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్ లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు పిటీషనర్లు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఆమలవుతుందని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్…