దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.. నిన్న లక్ష దాటేసి 1.14 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. ఇవాళ ఏకంగా 1,41,986 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. తెలంగాణలో నిన్న దాదాపు 3 వేల పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో 840 కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ ఆంక్షలు కూడా విధించింది ఆంధ్రప్రదేశ్.. ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూకు వెళ్తున్నారు.. ప్రస్తుతానికి తెలంగాణలో…
2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా క్యాడర్ ఉద్యోగుల పోస్టింగ్స్ పూర్తి చేసినట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. 22 వేల 418 మంది టీచర్‌లకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తే 21 వేల 800 మంది తమ కొత్త పోస్టుల్లో రిపోర్ట్ చేశారు.. మిగిలిన వారు కూడా ఈ రోజు రిపోర్ట్ చేస్తారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా 13 వేల 760 మంది జిల్లా క్యాడర్ ఉద్యోగులు కొత్త పోస్టుల్లో జాయిన్ అయ్యారని ఆయన పేర్కొన్నారు.…
కొత్త జోనల్ విధానం ప్రకారం జీవో 317 అమలుపై రాజకీయ రగడ నెలకొంది. ఇలాంటి సమయంలో సీఎం నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడి.. వారిని మందలించినంత పనిచేసినట్టు సమాచారం. ఇంతకీ ఏం జరిగింది? జీవో 317పై ఉద్యోగుల్లో గందరగోళం.. టెన్షన్317 జీవో. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశం. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై 317 జీవో ప్రకారమే మార్గదర్శకాలను విడుదల…
భారత ప్రభుత్వం సంవత్సరానికి రైతులకు ఆరువేల రూపాయలు ఇవ్వడానికి 100 షరతులు విధిస్తోందని, ఎలాంటి షరతులు లేకుండా కేసీఆర్ రైతులకు రైతు బంధు అమలు చేస్తున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు పథకంలో 92 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు ఉన్న వారేనని ఆయన వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో రైతులు ఆయిల్ ఇంజన్ తో వ్యవసాయం చేస్తున్నారని, ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్ లో ఉచిత విద్యుత్…
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ దళిత బంధును అందజేయాలని కార్యచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటితో 50 వేల కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమకానున్నాయన్నారు.…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. బంజారాహిల్స్ పీఎస్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై నమోదైన కేసులో ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంది హైకోర్టు. ఈమేరకు పోలీసులకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కార్టూన్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎంపీ అరవింద్. ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఓ కేసు నమోదైంది. సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేసి సమాజంలో…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారు..…
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జైలుకు వెళ్లిన ఆయన.. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి ఇవాళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. ఈ సందర్భంగా స్వాగత సభ ఏర్పాటు చేసింది రాష్ట్ర నాయకత్వం.. ఈ సభలో సంజయ్ మాట్లాడుతూ.. మరోసారి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్…
పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. దీనిపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతన్నల కడుపు మండిందని.. అందుకే వారు ప్రధాని మోదీకి చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా త్వరలోనే రైతులు బుద్ధి చెప్తారని… ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు.…
జీవో 317 పై అలుపెరుగని పోరాటం చేస్తామంటోంది బీజేపీ. ఉద్యోగ,ఉపాధ్యాయుల కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమం ముగియలేదని, బండి సంజయ్ ని రాజకీయంగా అణిచివేయాలని కేసీఆర్ కుట్రతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, అరెస్ట్ చేయడం తప్పు అని హైకోర్టు చెప్పింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు అంతా సిద్ధంగా ఉంటాం అన్నారాయన. రేపు ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్, తరుణ్ చుగ్, లక్ష్మణ్,డీకే అరుణ…