కరోనా విజృంభణ.. సంక్రాంతి తర్వాత స్కూళ్లు నడిచేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.. నిన్న లక్ష దాటేసి 1.14 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. ఇవాళ ఏకంగా 1,41,986 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. తెలంగాణలో నిన్న దాదాపు 3 వేల పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో 840 కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ ఆంక్షలు కూడా విధించింది ఆంధ్రప్రదేశ్.. ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూకు వెళ్తున్నారు.. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు.. సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. మరోవైపు.. ఇవాళ్టి నుంచి తెలంగాణలో సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యాయి.. గతంలో కంటే ఈసారి ఎక్కువ సెలవులే ఇచ్చింది సర్కార్.. సంక్రాంతి సెలవుల తర్వాత షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 17వ తేదీ నుంచి అన్ని స్కూళ్లు, విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోవాల్సి ఉంది.. కానీ, అప్పటి వరకు పరిస్థితి ఏంటి? మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Read Also: సంక్రాంతి ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధర
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
దీనికి ప్రధాన కారణం తెలంగాణలో క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోవడమే… ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని.. 15కు పైగా రాష్ట్రాల్లో ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఇక, రాష్ట్రంలోనూ వరుసగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి విద్యాసంస్థల ప్రారంభంకావడంపై సందేహం నెలకొంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 11 నుంచి స్కూళ్లకు, 13వ తేదీ నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. దానిని ముందుకు జరిపి.. ఇవాళ్టి నుంచే విద్యాసంస్థలకు సర్కార్ సెలవులు ఇచ్చారు సీఎం కేసీఆర్. 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా.. 17న తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సెలవుల తర్వాత భౌతిక తరగతులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కష్టమేననే చర్చ సాగుతోంది.. మరోవైపు, మళ్లీ ఆన్‌లైన్, టీవీ పాఠాల కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.. కోవిడ్ ఎఫెక్ట్‌తో అంతా భౌతిక తరగతులకు దూరమై.. ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం అయ్యారు.. దీంతో విద్యావ్యవస్థ గాడీ తప్పి, విద్యార్థులు సబ్జెక్ట్ పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి కూడా.. వారి ప్రవర్తనలోనూ చాలా మార్పులు వచ్చాయి.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్లీ ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి.. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్‌లైన్ బోధనే కొనసాగిస్తున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లు అన్ని.. చాలా వరకు ప్రైవేట్ స్కూళ్లు కూడా భౌతిక తరగతులు ప్రారంభించాయి.. ఇప్పుడిప్పుడే విద్యావ్యవస్థ గాడిన పడుతోంది.. విద్యార్థులు కాస్త చురుకుగా కనిపిస్తున్నారు.. ఈ సమయంలో.. మళ్లీ కోవిడ్, ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. మళ్లీ ఆన్‌లైన్ క్లాసులకు వెళ్తే పరిస్థితి ఏంటి? అనే చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!