ఉపఎన్నికలో బంపర్ మెజారిటీతో గెలిచిన ఆ నియోజకవర్గం TRSలో గ్రూప్‌ఫైట్ మొదలైందా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్యపోరు రాజుకుందా? గ్రూపులు యాక్టివ్ అవుతున్నాయా? ఏంటా నియోజవర్గం? ఎవరా నాయకులు? భగత్‌పై అసంతృప్తులు.. వ్యతిరేక సెగలు..!ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్. ఆ మధ్య ఉపఎన్నిక రావడంతో అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపై నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు నోముల భగత్ గెలిచారు. ఆ పోరు ముగిసిన 8 నెలలకే…
మరోసారి టీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన.. తెలంగాణలో అవినీతి దేశంలో ఎక్కడ లేదని జేపీ నడ్డా చెబుతున్నారు.. మరీ, ఆ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదు? అని ప్రశ్నించారు. Read Also: కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విమాన చార్జీలు..! ఢిల్లీ నుంచి తెలంగాణకు…
తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి.. కొందరు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మరికొన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి.. మరోవైపు నిన్నటి(డిసెంబర్ 4వ తేదీ 2022)తో 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసిపోయింది.. దీంతో.. నేటి నుంచి కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ప్రారంభం కానుందని.. నేటి నుంచి ఆరు సంవత్సరాల పాటు కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీలు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ప్రకటించింది.. Read Also:…
ఆ ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారా? పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారా? ఎమ్మెల్యే ఒక అధికారి పేరును ప్రతిపాదిస్తే.. ముఖ్యమంత్రి మరో ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఆయనపై సీఎం ఎందుకు గుర్రుగా ఉన్నారు? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? నల్లగొండపై సీఎం సమీక్షలో ఆసక్తికర అంశాలుఇటీవల నల్లగొండ జిల్లాలో పర్యటించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ తండ్రి చనిపోవడంతో పరామర్శకు వెళ్లారు ముఖ్యమంత్రి. ఈ పర్యటన సందర్భంగా నల్గొండ…
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని కేసీఆర్ ఆదేశించారు. నేడు కేసీఆర్ వైద్యాశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు వైద్యశాఖ ఉన్నతస్థాయి అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… హెచ్ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు…
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభన మొదలైంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో ఆంక్షలు విధించారు. అయితే తాజాగా భారత్‌లోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు తెలంగాణలో పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు.…
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని రైతులకు అందించడానికి నిధుల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు బంధు ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన రైతు బంధు పథకం గురంచి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పథకాన్ని అర్హులు అయిన ప్రతి ఒక్క రైతుకు అమలు చేస్తామన్నారు. అలాగే సోమవారం ఐదో రోజు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్ లలో జమ అయ్యాయని తెలిపారు. నేడు రూ.…
తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య పొంతన కుదరడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగ్గారెడ్డి పార్టీలో విముఖతతోనే ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి తీరుతో టీఆర్‌ఎస్ కోవర్టు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన నేను కేసీఆర్ కోవర్టును కాదని, నేనేవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అయితే తాజాగా మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కొత్తగా…
ఉద్యోగ బదీలీల అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా ఆయన దీక్ష చేపట్టారంటూ నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్ని ఆయన అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, బండి సంజయ్ కార్యాలయంలోకి బలవంతంగా వెళ్లి…
ఓ వర్గం మహిళలను టార్గెట్ చేస్తూ.. బుల్లి బై పేరుతో ఉన్న ఓ యాప్ విరుచుకుపడుతోంది.. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఈ యాప్ ఆగడాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు.. ఇక, ముంబైలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళలు సింగిల్‌గా ఉన్న ఫొటోలను తీసుకుని.. వాటిని ఈ యాప్‌లో అమ్మకానికి పెట్టడం.. వాటిని వేలం వేయడమే బుల్లి బై యాప్…