కరోనా భయం తొలగిపోలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తత పై ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు , ఇరిగేషన్…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించ తలపెట్టిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రి సీఎం కేసీఆర్ ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం లాంటి ఏర్పాట్లపై చినజీయర్‌తో చర్చించనున్నారు. అంతేకాకుండా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయం…
అసోం సీఎంకి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీకి చెందిన జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి కేసీఆర్ పాలనపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ చేసిన కామెంట్స్ పై ట్విట్టర్లో స్పందించారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ గొప్ప సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం అవడం లేదన్నారు. 2018 ఎన్నికల్లో ఇలాగే…
తెలంగాణ రాష్ట్ర, చారిత్రాత్మక హన్మకొండ నగర అభివృద్ధిని వీక్షించేందుకు విచ్చేస్తున్నా బీజేపీ కేంద్ర నాయకత్వానికి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మకి స్వాగతమని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చారిత్రక నగరం హన్మకొండకు వచ్చే ముందు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు నెరవేర్చిన తరువాత నగరంలో అడుగు పెట్టండని ఆయన అన్నారు. వరంగల్ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి…
సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కరీంనగర్ లో బెయిల్ పై విడుదల అయిన మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మీడియా పై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి భయపెడుతున్నారని మండిపడ్డారు. జిల్లాల సంఖ్య పది నుంచి 33కి, జోన్లు రెండు నుంచి ఏడుగా మార్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి సవరణ చేసి…
పంజాబ్‌లో జరిగిన ఘటన పై తెలంగాణ ప్రజలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ముసుగులో ప్రధాని ప్రాణానికే ప్రమాదం కలిగే పన్నాగం కాంగ్రెస్ పన్నిందని ఆయన ఆరోపించారు. మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ బాధ్యత రహితంగా, హేళనగా మాట్లాడారని, అక్కడి ప్రభుత్వ లోపాలను ఖండించాల్సింది పోయి.. బీజేపీ తెలంగాణలో బలోపేతం అవుతున్నదని అక్కసుతో మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ కి వత్తాసు పలుకుతున్నారు…
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్‌లో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు తరలివచ్చారు. అంతేకాకుండా నేడు బండి సంజయ్‌కి ఏకంగా ప్రధాని మోడీ ఫోన్ చేసి దాడి, అరెస్ట్‌లపై ఆరా తీశారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతోందనే భావన కూడా తెలంగాణ ప్రజల్లో బలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం…
తెలంగాణ శాసన మండలిలో 12 మంది ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది. వీరిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఉండడంతో… కొత్త ప్రొటెం చైర్మన్ కు కసరత్తు పూర్తయింది. కొత్త ప్రొటెం చైర్మన్ గా రాజేశ్వర్ రావు నియామకం కానున్నారు. తెలంగాణ శాసన మండలిలో12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఇందులో కొద్ది మంది తిరిగి శాసన మండలికి ఎన్నికయ్యారు. మొత్తం 12 మంది శాసన మండలి సభ్యులు ఈ నెల 12 న ఎమ్మెల్సీలుగా…
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా నిధులు ఇస్తోంది. రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 63 లక్షల తెలంగాణ రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో వ్యవసాయం కోసం అప్సులు తెచ్చుకునే బాధ చాలామటుకు తప్పుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని…
మానవాళికి సవాల్ విసురుతోంది కరోనా మహమ్మారి. కోవిడ్ విరుచుకుపడడంతో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన వారెందరో. అనాథలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అనాథలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనుంది. సిగ్నళ్ల వద్ద అనాథలతో భిక్షాటన చేసే వారిని కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు అండగా సర్కార్ నిలవనుంది. అనాథలకు కేజీ నుంచి…