తెలంగాణలో టీఆర్ఎస్- బీజేపీ నేతల అకృత్యాలకు ఉద్యోగులు, జనం బలి అవుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ. వనమా రాఘవ ఎపిసోడ్ ముగియక ముందే.. నిజామాబాద్ లో మరో సంఘటన మొదలైందన్నారు. నిజామాబాద్ లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలు కారణం అన్నారు. ఎంపీ అరవింద్ అండ దండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకి మానవత్వం ఉంటే వెంటనే జీఓ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మధుయాష్కీ నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ…
తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ కి రాజకీయ ప్రయోజనాల కంటే..రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. కెసిఆర్ రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థ కి కేంద్రం ఆమోదం తో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది. జీఓ 317తో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీఓ ఉందన్నారు రేవంత్.…
తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు.
భూగర్భ జలాల సంరక్షణలో తెలంగాణ ఆదర్శప్రాయంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నేడు పచ్చని పొలాలు…పంటలు ఉన్నాయని ఆయన అన్నారు. పాలమూరుకు ఇప్పుడు వలస పోయిన కార్మికులు వెనక్కి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎకరా భూమి విలువ పది నుంచి పదిహేను లక్షలు పలుకుతోందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి అమ్ముతామంటే కొనేవారు దిక్కులేరని.. ఇప్పుడు భూమి కొందామంటే.. అమ్మేవారు లేరని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను తగ్గించడంలో తెలంగాణ…
కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు అని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్య పొలిటికల్ టూరిస్ట్‌లు వచ్చి ఏదోదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా 64 లక్షల మంది రైతుల ఖాతాలోకి 50 వేల కోట్లు జమ అయ్యిందని, తెలంగాణ రాకంటే ముందు ఈ ప్రాంత పరిస్థితి బోర్ల కింద పంటలు.. బోర్ల పడ్డ బతుకులుగా ఉండేవన్నారు. సమైక్య పాలనలో…
ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీ ఇప్పుడు ఎదుగుతూ వుంది. దానికి మేం కారణం కాదు. కాంగ్రెస్ బలహీనంగా వుంది. మతాన్ని ఉపయోగించుకుని ముందుకెళుతోంది. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల బీజేపీ యూపీలో ఎదిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీలో కలిసిపోయారు. మేం కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అని భావించలేదు. కమ్యూనిస్టుల శక్తి ఏంటో మాకు తెలుసు. కాంగ్రెస్ మీద అసహనంతో బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ ని అవసరమయిన సమయాల్లో విమర్శించాలి.…
కమ్యూనిస్ట్ పార్టీలు మారుతున్నాయన్నారు సీపీఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీకి దూరంగా వున్న పార్టీలకు మేం దగ్గరవుతాం. సీఎం కేసీఆర్‌ని కలవడంలో ఉద్దేశం అదే అన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒకే విధంగా వుంది. ఏదో శక్తి దేశంలో నిలబడి వుంది. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు భిన్నంగా మేం నడుస్తున్నాం. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది. బీజేపీ మతం తీసుకు వస్తోంది. కమ్యూనిస్టులు అన్ని శక్తుల్ని…
రాష్ట్రంలో నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు కేసీఆర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌ల అనుమతుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘం వారు కోరుతున్న అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి…
సెక్రటేరియట్ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు కేసీఆర్. నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమౌతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసీఆర్ ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల…