నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. బంజారాహిల్స్ పీఎస్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై నమోదైన కేసులో ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంది హైకోర్టు. ఈమేరకు పోలీసులకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కార్టూన్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎంపీ అరవింద్.
ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఓ కేసు నమోదైంది. సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేసి సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతీసేందుకు ప్రయత్నించారని బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో కార్టూన్ ఫోటో పోస్ట్ చేయడం క్రిమినల్ చర్య కాదంది హైకోర్టు. అంతేకాకుండా విభిన్న గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదని ఎంపీ అరవింద్ ను హెచ్చరించారు జస్టిస్ ఉజ్జల్ భూయాన్