తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా్ల్లో కొనసాగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఎన్నో వాగ్ధానాలు చేశారు.. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులే కొనసాగుతున్నాయి కానీ.. కొత్తవేమి లేవని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన హామీ 8 ఏండ్లు అవుతున్నా ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లో బిజీ అయ్యి… ఇచ్చిన హామీలు…
సీఎం కేసీఆర్ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కురిపిస్తున్నారంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెప్ పార్టీ ఏం చేసిందని టీఆర్ఎస్ నాయకులు పదేపదే అడుగుతున్నారని చెప్పిన ఆయన.. ఈ 8 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రైతులకు రుణమాఫీ కూడా చేయలేదని ఆరోపించారు. లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే.. మొదటి సంతకం చేసింది…
తెలంగాణలో అందరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం,తుక్కుగూడ లలో 254 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నూతన జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ చెక్కులతో పాటు చిరు కానుకగా చీరను అందించారు. వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. పేదింటి ఆడపిల్లలకు ముఖ్యమంత్రి కేసీఆర్…
ఉత్తరాది రాష్ట్రాల్లో తన పర్యటనను మొదలుపెట్టినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తుతోన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద మంత్రులకు, ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదని.. అసలు ఆయన్ను భరించే శక్తి వారికి లేదని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, వాళ్ళకు వాళ్ళే కూల్చుకుంటారన్నారు. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని.. ఆ భయంతోనే ఢిల్లీ పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని, కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు.…
బీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు పుట్టే పరిస్థితి లేదని.. అయినా గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా ట్విట్టర్విల్లులో విమర్శనాస్త్రాలు సంధించారు. ”ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి కానీ, ఆచరణలో కూడా ఉంటే బాగుంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రాన్ని కాస్తా ఇప్పుడు అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు. అప్పు…
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు తెలంగా సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 20 జాతీయ పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన పర్యటన ఈ నెలాఖరు వరకు కొనసాగిల్సి ఉండగా మధ్యలోనే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 20న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఈ నెల 21న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 22న ఢిల్లీ సీఎం కేజీవాల్‌తో…
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం, దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈనెల 31న 11 వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాలో జమ ఈ సందర్భంగా మోడీ ప్రసంగించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను.. ఇది పార్టీ ప్రోగ్రాం కాదని గుర్తుంచుకోవాలి. కేంద్రంలో లో కాంగ్రెసేతర ప్రభుత్వం…
2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. జనంలోకి వెళ్ళేందుకు యాత్రలతో బీజేపీ నేతలు బిజీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రజాసంగ్రాయాత్రలు చేశారు బండి సంజయ్. తెలంగాణలో మరో విడత ప్రజా సంగ్రామయాత్రకు రెడీ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోంది. తెలంగాణలో ఆత్మహత్యలే లేవన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వక్రభాష్యాన్ని చూసి…
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారని, బీజేపీ సర్కార్ రావాలని ఎదురుచూస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి బీజేపీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ తో పాటు తరుణ్ చుగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ముక్త్ తెలంగాణ బీజేపీ లక్ష్యం అన్నారు. టీఆర్ఎస్…
బీసీ ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఆయనను ఎంపికచేశారు సీఎం, వైసీపీ అధినేత జగన్. ఉద్యమకారుడైన కృష్ణయ్యను జగన్ ఎంపిక చేయడం వెనకాల బీసీలకు న్యాయం చేయాలని తపన వుంది. తెలంగాణలో బీసీ ఉద్యమాలు చేసిన కృష్ణయ్యను జగన్ గుర్తించారు.కానీ సీఎం కేసీఆర్ తనను గుర్తించారని, కానీ ముందుగా జగన్ అవకాశం ఇచ్చారన్నారు. ఈ పదవి వెనుక కేసీఆర్ హస్తం వుందనేది సరైన ప్రచారం అన్నారు. బీసీలు బాగుండాలి, బీసీలు…